వాణిజ్య వినియోగ సిలిండర్‌‌పై భారీ పెంపు!

gas

గ్యాస్‌ ధరలను చమురు సంస్థలు మార్పులు చేశాయి. గృహ వినియోగానికి సంబంధించిన 14.2కిలోల వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేకుండా.. రూ.1002 వద్ద నిలకడగా ఉన్నప్పటికీ.. వాణిజ్య వినియోగ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు భారీగా పెంచాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.273.50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,186 నుంచి రూ.2,460కి పెరిగింది.