Dolo650: ప్రస్తుతం ప్రపంచ దేశాలలో కరోనా కొత్త వేరియంట్లలో రూపంలో ప్రపంచ దేశాల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది. మనదేశంలో ఈ కరోనా వ్యాపించిన సమయం నుండి కొన్ని మెడిసిన్స్ అత్యధికంగా అమ్ముడు పోయాయి. అయితే కరోనా వ్యాప్తి చెందిన సమయంలో అన్నింటికన్నా ఎక్కువగా డోలో 650 అత్యధికంగా ఆదరణ పొందింది. ఈ మెడిసిన్ మనదేశంలో ఇంత ఆదరణ పొందడానికి గల కారణాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మెడిసిన్ ఎవరెవరు వాడవచ్చు అన్న విషయం గురించి తెలుసుకుందాం.
సాధారణంగా Dolo650 టాబ్లెట్ జ్వరం,తలనొప్పి, ఒళ్ళునొప్పులు ,కడుపు నొప్పి వంటి వాటినుండి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో జ్వరం, జలుబు వంటి ఆరోగ్య సమస్యలను కలిగించే కొన్ని రసాయనాలను నిరోధించడానికి ఈ టాబ్లెట్ ఎక్కువగా పనిచేస్తుంది.Dolo650 టాబ్లెట్స్ డాక్టర్ సలహాలు తీసుకొని పరిమితంగా వేసుకోవటం శ్రేయస్కరం.
మన మెదడులో నొప్పిని కలిగించి రసాయనాలను నివారించడానికి dolo 650 టాబ్లెట్ వినియోగిస్తారు. ఈ టాబ్లెట్ ఎక్కువగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. ఈ టాబ్లెట్ జ్వరం ,తలనొప్పి ,ఒళ్ళు నొప్పులు ఉన్న సమయంలో డాక్టర్ ఇతర మందులతో కలిపి, లేదా dolo 650 టాబ్లెట్ మాత్రమే సూచించినప్పుడు వేసుకోవాలి. ఎక్కువ మోతాదులో ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో లేదా బాలింతలు గా ఉన్నప్పుడు డాక్టర్ సలహాల మేరకు ఈ టాబ్లెట్స్ ఉపయోగించాలి. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు డాక్టర్ ని సంప్రదించి వారి సూచనల మేరకు ఈ టాబ్లెట్స్ వినియోగించాలి. కొందరికి ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అటువంటి వారు వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది.