Health Tips: హెల్మెట్ వాడటం వల్ల జుట్టు రాలుతోందా? అయితే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

Health Tips: సాధారణంగాప్రస్తుత కాలంలో అందరిని వేధిస్తున్న సమస్యలు జుట్టు రాలే సమస్య కూడా ప్రధానమైనది గా చెప్పుకోవచ్చు. వాతావరణంలో కాలుష్యం పెరగటం వల్ల, మనం తీసుకునే ఆహారంలో మార్పులు వల్ల అనేక జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. అంతే కాకుండా చాలా మంది ప్రమాదాలను అరికట్టడానికి హెల్మెట్ వాడటం అలవాటు చేసుకున్నారు. ఈ అలవాటు వల్ల ప్రమాదాలను నివారించినా కూడా జుట్టు రాలే సమస్య మాత్రం పెరుగుతోంది. ఈ సమస్యను నియంత్రించటానికి కొన్ని చిట్కాలు గురించి తెలుసుకుందాం.

• హెల్మెట్ ఎక్కువగా ఉపయోగించటం వల్ల జుట్టు కి గాలి తగలక జుట్టు జిడ్డుగా తయారవుతుంది. ఇలా తల మీద చర్మే, జుట్టు జిడ్డుగా ఉండటం వల్ల చుండ్రు వచ్చి జుట్టు రాలిపోతుంది. అందువల్ల ముఖ్యంగా ఈ వేసవి కాలంలో రోజు జుట్టు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి రోజు జుట్టుకి నూనె రాసి తల స్నానం చేయటం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

• రోజు హెల్మెట్ పెట్టుకునేవారు మంచి నాణ్యమైన హెల్మెట్ వాడుతూ హెల్మెట్ నీ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. హెల్మెట్ లోని దుమ్ము, బ్యాక్టీరియా వల్ల జుట్టు చిట్లాటం, జుట్టు రాలటం వంటి సమస్యలు తగ్గుతాయి.

• ప్రతి రోజూ హెల్మెట్ ఉపయోగించే వారు హెల్మెట్ కింద మంచి కాటన్ క్లాత్ ధరించటం వల్ల చెమట పీల్చుకొని జుట్టు రాలకుండా కాపాడుతుంది.

• ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు తడిగా ఉన్నప్పుడు హెల్మెట్ ధరించకూడదు. అలా చేయటం వల్ల తలలో చుండ్రు ఏర్పడి జుట్టు రాలిపోతుంది.