Omicron Variant: ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్ మన శరీరం మీద ప్రభావం చూపుతుందా…?

Omicron Variant: గత కొంతకాలంగా కోవిడ్ వల్ల మనం చాలా సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే కాగా కోవిడ్ కనుమరుగవుతున్న వేళ ఓమిక్రాన్ అనే మరో కొత్త వేరియంట్ ఉద్భవించి, అందరిని భయాందోళనలకు గురి చేస్తుంది. ఈ వేరియంట్ మన పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది దీని వల్ల ఏ విధమైన వ్యక్తి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

మొదటిసారిగా దక్షిణాఫ్రికాలో నవంబర్ 2021 దీనిని కనుగొన్నారు. భారత్ లో కూడా దీనికి భిన్నంగా లేదు.
ఓమిక్రాన్ ప్రభావం తేలికపాటిదని వైద్య నిపుణులు విశ్వసిస్తున్నప్పటికీ దానిని తేలికగా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

జ్వరం జలుబు అలాగే దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లయితే వెంటనే పరీక్ష చేయించుకోండి. అంతేకాకుండా గొంతు నొప్పి,ముక్కు కారటం,శరీర నొప్పులు, వంటి లక్షణాలు కూడా ఓమిక్రాన్ లో ఉన్నాయి. అలాగే శ్వాస ఇబ్బంది ఈ సమస్యలు ఉన్న వెంటనే వైద్యుని సంప్రదించండి.

ఓమిక్రాన్ ని గుర్తించడం ఎలా..?

covid 19 గుర్తించే ఏకైక మార్గం RT-PCR పరీక్ష
ఇది ఓమిక్రాన్ ఉనికి కోసం జన్యు పరీక్ష ద్వారా చేయబడుతుంది. అయినప్పటికీ మీరు తీవ్రమైన జలుబు, దగ్గు,జ్వరం,తలనొప్పి అలాగే శరీర నొప్పులు అనిపిస్తే వెంటనే క్వారంటైన్ చేయండి. ఓమిక్రాన్ గురించిన వివరాలను మీ సమీపంలోని వైద్యులను అడిగి తెలుసుకోండి.

పాజిటివ్ అయితే తీసుకునే జాగ్రత్తలు….

* మిమ్మల్ని మీరు హోమ్ క్వారంటైన్ చేసుకోండి. వైద్యుని సలహాలను తీసుకోండి.

* వైద్యులు సూచించినటువంటి మందులను అలాగే విటమిన్స్ “c”వంటి ఇతర సప్లిమెంట్లను కూడా తీసుకోండి.

* మంచి పౌష్టికాహారం ను కూడా తీసుకోండి.

* మానసిక ధైర్యం ఈ సమయంలో చాలా ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి.

* కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాస్కును ధరించి, సామాజిక దూరాన్ని పాటించండి అంతేకాకుండా వ్యక్తి గత శుభ్రతను కూడా పాటించండి.

* తీవ్రమైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించండి.

ఓమిక్రాన్ అలాగే ఇన్ఫ్లుఎంజా ప్రాథమిక లక్షణాలు మధ్య తేడాను గుర్తించడం కూడా చాలా ముఖ్యం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ సమస్యకు దూరంగా ఉండవచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.