Health Tips: వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చర్మం మీద దద్దుర్లు వస్తున్నాయా? అయితే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

Health Tips: వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల అనేక ఆరోగ్య వేధిస్తూ ఉంటాయి. అయితే ఈ వేసవి తాపం వల్ల చాలా మంది చమటకాయలు, చర్మం మీద చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడతాయి. వీటివల్ల చర్మం మీద దురద, మంట ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్య నుండి విముక్తి పొందటానికి కొని ఇంటి చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

ప్రతి ఇంట్లో కొబ్బరి నూనె కచ్చితంగా ఉంటుంది. అధిక ఉష్టోగ్రత వల్ల చర్మం మీద ఏర్పడిన ర్యాషేస్ తగ్గడానికి కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు ర్యాషేస్ ఉన్న ప్రదేశంలో కొబ్బరినూనె రాసి ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.ఇలా చేయటం వల్ల ర్యాషేస్ తగ్గుతాయి.

కలబందలో ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల కారకాలు ఉంటాయి. ఇది చర్మ, జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగపడుతుంది. వేసవి ఉష్ణోగ్రత వల్ల చర్మం మీద వచ్చిన ర్యాషేస్ తగ్గటానికి కలబంద గుజ్జు బాగా పని చేస్తుంది. కలబంద గుజ్జు కొంచం సేపు ఫ్రిజ్ లో ఉంచి ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ర్యాషేస్ ఉన్న ప్రదేశంలో అంటించి ఉదయం స్నానం చేయాలి. ఒక వారం రోజులు ఇలా చేయటం వల్ల మీ సమస్య తగ్గుతుంది.

శరీరానికి చలవ ఇచ్చే కీర దోసకాయ ముక్కలు కొంచెం సేపు ఫ్రిజ్ లో ఉంచి తర్వాత వాటితో ర్యాషేస్ మీద మర్దన చేయాలి . ఇలా చేయటం వల్ల ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. అలాగే కొంచం ముల్తానీ మట్టి తీసుకొని అందులో కొన్ని రోజ్ వాటర్ కలిపి సమస్య ఉన్న చోట రాయాలి. ముల్తానీ మట్టి శరీరానికి చలువనిచ్చి ర్యాషేస్ సమస్య తగ్గిస్తుంది.