తన భర్తతో కలిసి నటించక పోవడానికి అసలు కారణం చెప్పిన డాక్టర్ బాబు భార్య మంజుల?

తెలుగు బుల్లితెరపై శోభన్ బాబుగా ఎంతో గుర్తింపు పొందిన పరిటాల నిరుపమ్ ఎన్నో సీరియల్స్ లో నటించి విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే ఈయన భార్య మంజుల కూడా బుల్లితెర నటి అనే విషయం మనకు తెలిసిందే. చంద్రముఖి సీరియల్ ద్వారా పరిచయమైన ఇద్దరు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ విధంగా వీరిద్దరూ పలు సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే నిరుపమ్ కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబుగా గుర్తింపు పొందారు. ఈ సీరియల్ లో ఈయన పాత్రకు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి.

అయితే ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ నుంచి తప్పుకున్న డాక్టర్ బాబు తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో ఆశక్తికరమైన వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే తాజాగా వీరి యూట్యూబ్ ఛానల్ ద్వారా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే కాంటెస్ట్ నిర్వహించారు. ఈ విధంగా డాక్టర్ బాబు కార్తీకదీపం రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే కొందరు నెటిజన్లు డాక్టర్ బాబు తన భార్య మంజుల కలిసి ఒకే సీరియల్ లో నటించకపోవడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు మంజుల సమాధానం చెబుతూ.. నిజాలు మాట్లాడుకుంటే ప్రస్తుతం తనకు 36 సంవత్సరాలు. తనకి సీరియల్స్ లో హీరోయిన్ పాత్రలు ఇచ్చే అవకాశమే లేదు. ఇకపోతే నిరుపమ్ ప్రస్తుతం సీరియల్ లో హీరో పాత్రలలో చేస్తున్నారు. ఆయన హీరోగా కాకుండా ఇతర పాత్రలు చేయరు కనుక, నేను తనతో పాటు కలిసి ఒకే సీరియల్ లో నటించేలేకపోతున్నామని ఈ సందర్భంగా మంజుల తెలిపారు. ఇకపోతే సీరియల్స్ లో కాకుండా ఏదైనా వెబ్ సిరీస్ లో మా ఇద్దరికీ అనుగుణంగా కథ దొరికితే తప్పకుండా ఇద్దరం నటిస్తామని మంజుల తెలియజేశారు.