‘ప్రిన్సెస్ సితార.. ‘కాబోయే హీరోయిన్..’ అంటూ సూపర్ స్టార్ ముద్దుల తనయ సితార పాపని అభిమానులు పిలుస్తున్నారు. అవును నిజమే, సితారకి సోషల్ మీడియా వేదికగా బోలెడంత ఫాలోయింగ్ వున్న సంగతి తెలిసిందే.
సితార తల్లి, మహేష్ బాబు భార్య అయిన నమ్రత ఒకప్పుడు హీరోయిన్. తెలుగులోనూ సినిమాలు చేసింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. సితార మేనత్త, సూపర్ స్టార్ కృష్ణ తనయ అయిన మంజులను హీరోయిన్‌గా అప్పుడు కృష్ణ అభిమానులు ఒప్పుకోలేదు. అలా ఆమెకి హీరోయిన్ అవ్వాలన్న కోరిక నెరవేరలేదు.
నిర్మాతగా, ఆ తర్వాత నటిగా ఏదో అలా మమ అనిపించేసిందంతే మంజుల. అయితే, అప్పటి పరిస్థితులు వేరు. నేటి పరిస్థితులు వేరు. సితారకున్న ఫాలోయింగ్‌తో హీరోయిన్ అవ్వదగ్గ అవకాశాలు ఆమెకు చాలా చాలా కనిపిస్తున్నాయ్. రీసెంట్‌గా ‘సారంగదరియా..’ పాటకు లంగా వోణీలో సితార వేసిన స్టెప్పులు కొందరు నెటిజన్లను ఫిదా చేయగా, మరికొందరు సితారను ట్రోల్ చేస్తున్నారు.
మెగా డాటర్ నిహారిక విషయంలో ఎలాంటి ట్రోల్స్ జరుగుతున్నాయ్ చూస్తున్నాం. మరి, ఘట్టమనేని వారసురాలు సితారం విషయంలో ఏం జరుగుతుందో చూడాలి మరి.