డాక్టర్ల కొడుకులు డాక్టర్లు, రాజకీయ నాయకుల కొడుకులు రాజకీయ నాయకులు అలాగే సినీ హీరో కొడుకులు హీరోలు అవ్వటం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. అయితే తమ అభిమాన నటుల కొడుకులని తమ హీరోలుగా ఓన్ చేసుకునే ఫ్యాన్స్ హీరో కూతుర్లని మాత్రం సినిమాల్లోకి తీసుకొస్తానంటే పెద్దగా ఇష్టపడరు. తమ అభిమాన హీరో కూతుర్లని తమ ఇంటి బిడ్డలుగా భావించడమే అందుకు కారణమేమో.
సూపర్ స్టార్ కృష్ణ కొడుకుని సూపర్ స్టార్ గా ఓన్ చేసుకున్న అభిమానులు కృష్ణ గారి కూతురు మంజులని మాత్రం హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు మెగా డాటర్ నిహారిక కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటుంది. ఏమాత్రం హద్దు దాటి సినిమాలలో కనిపించినా మెగా ఇంటి పరువు తీయొద్దు అంటూ ఆమెపై కోప్పడతారు. అయితే ఈ విషయం బాగా గ్రహించిన మాస్ మహారాజా రవితేజ తన కూతురి కెరియర్ యాక్టింగ్ లో కాకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. అందుకే ఆమెని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేసాడంట రవితేజ.
ఇక తండ్రి చెప్పినట్టు ఆమె డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే కెరియర్ బిల్డ్ చేసుకుంటుందో లేదంటే తండ్రిలా ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసి తర్వాత తెరపై కనిపిస్తుందో చూడాలి. ఇక రవితేజ తన కొడుకుని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎప్పుడో తెరపైకి తీసుకువచ్చాడు. రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్ చేసింది మాస్ మహారాజా కొడుకు మహాధన్ అని అందరికీ తెలిసిందే.
ఇప్పుడు అతను ఒక వైపు చదువుకుంటూనే మరొకవైపు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మెలకువలు నేర్చుకుంటున్నాడంట. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ రేంజ్ కి వచ్చిన రవితేజ తన తమ్ముళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు కానీ వాళ్ళు ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. అయితే తన పిల్లల్ని మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు రవితేజ. మరి మోక్షధ,మహాధన్ అతని ఆశలు ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి.