కృష్ణ పెళ్లి రోజుని గుర్తు చేసుకుని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మంజుల… పోస్ట్ వైరల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈయన అనారోగ్య సమస్యతో హాస్పిటల్లో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే మరణించడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయింది. ఇలా కృష్ణ మరణ వార్త నుంచి ఇప్పటికి మహేష్ బాబు కుటుంబ సభ్యులు బయటపడలేకపోతున్నారు.ఇకపోతే నేడు కృష్ణ ఇందిరాదేవిల వివాహ వార్షికోత్సవం కావడంతో తన కుమార్తె మంజుల సోషల్ మీడియా వేదికగా తమ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ఇదే రోజున గత కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణ ఇందిరా దేవి మెడలో మూడు ముళ్ళు వేసి ఆమెతోపాటు ఏడడుగులు నడిచి కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.ఇలా ఇన్ని రోజులపాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ దంపతులు ఈ వివాహ వార్షికోత్సవానికి ఇద్దరు ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో మంజుల ఇదే విషయాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా మంజుల సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. తమ తల్లిదండ్రుల భాగస్వామ్యం ప్రస్తుతం స్వర్గంలో జరుగుతోందని తన తల్లి మరణించిన తర్వాత ఆమె లేని లోటును తన తండ్రి ఎంతో అనుభవించారని అందుకే మమ్మల్ని వదిలి వెంటనే తన వద్దకు వెళ్లిపోయారంటూ ఈ సందర్భంగా మంజుల తన తల్లి ఇందిరాదేవి తండ్రి కృష్ణతో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.