Puffy Eyes: ఉదయం నిద్ర లేచేసరికి మీ కళ్ళు ఉబ్బుతున్నాయా…అయితే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

Puffy Eyes: మన శరీరంలో అన్ని సక్రమంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయని సంకేతంగా కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం నిర్లక్ష్యం చేయకుండా తగిన సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడవచ్చు . చాలామందిలో ఉదయం నిద్రలేచే సరికి కళ్ళు ఉబ్బి ఉంటాయి. ఇలా జరగటానికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు .

ప్రస్తుత కాలంలో పిల్లలు , పెద్దలు ఎక్కువగా ఫోన్ చూడటానికి బాగా అలవాటు పడిపోయారు. ఇలా రాత్రిపూట ఎక్కువ సమయం ఫోన్ చూడటం వల్ల సమయానికి నిద్ర లేక కళ్ళు ఉబ్బినట్టు తయారవుతాయి. అందువల్ల రాత్రిపూట తొందరగా పడుకొని ఉదయం తొందరగా నిద్ర లేవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

శరీరానికి అవసరమైన మోతాదులో నీటిని తాగకపోవటం వల్ల కూడా ఈ సమస్య మొదలవుతుంది. అందువల్ల ప్రతిరోజు తగిన మోతాదులో నీటిని తాగి శరీరాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా చూడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో పాటు కళ్ళకింద వాపును కూడా నివారించవచ్చు .ప్రస్తుత కాలంలో మద్యానికి బాగా అలవాటు పడిపోయారు. మద్యం అధికంగా సేవించటం , పడుకునే సమయంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వంటి ఇతర కారణాల వల్ల ఈ సమస్య మొదలవుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవటంవల్ల ఈ సమస్యను నివారించవచ్చు.

ఇటువంటి సమస్యతో బాధపడేవారు కొన్ని చిట్కాలను పాటించడంవల్ల ఈ సమస్యను దూరం చేయవచ్చు. రాత్రిపూట పాలలో కొన్ని నీటిని కలిపి ఐస్ క్యూబ్ ట్రేలో పోసి ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఉదయానికి అవి క్యూబ్స్ లాగా తయారవుతాయి. కళ్ళు ఉబ్బరం వంటి సమస్యతో బాధపడేవారు ఉదయం లేవగానే ఈ ఈ ఐస్ క్యూబ్ తో కళ్ళపై మర్దన చేయడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే కీర దోసకాయ నీ గుండ్రంగా కట్ చేసి కళ్ళపై ఉంచుకోవటం వల్ల కళ్ళ వాపులు తగ్గుతాయి.