Health Tips: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సమయానికి ఆహారం తీసుకోకపోవటం, సమయానికి నిద్రపోకపోవటం వంటి వాటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.ప్రస్తుతం అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్యలు మతిమరుపు సమస్య కూడా ఒకటి. ఒక చోట పెట్టిన వస్తువుని మరొకచోట వెతకడం, ఇంట్లో,ఆఫీస్ లేదా బయట వేరే ఏ పనైనా సరైన సమయానికి చేయలేకపోవడం వంటివి చాలామంది చేస్తుంటారు.దీనిని ఎవరైనా ప్రశ్నిస్తే వచ్చే జవాబు గుర్తులేదు, మర్చిపోయాను. నిజానికి ఉరుకుల పరుగుల జీవనశైలి వల్ల ఎవరు ఏ పని మీద ధ్యాస పెట్టి చేయలేక పోతున్నారు. పని త్వరగా చేయాలి అనే కుతూహలంతో ఒక పని అయిపోకముందే మరొక పని గురించి ఆలోచిస్తుంటారు.
జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవటానికి ఎవరు ఎటువంటి ఆసక్తి చూపడంలేదు. మనం తినే ఆహారం, జీవనశైలిలో మార్పుల వల్ల జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవచ్చు. మీరు తినే ఆహారం మీ జ్ఞాపకశక్తి మీద చాలా ప్రభావం చూపుతుంది. మనం రోజూ తినే ఆహారంలో ఆరోగ్యకర నూనెలు,కొవ్వులు, కూరగాయలు, చక్కెర, ధాన్యం వంటి వాటిని భాగం చేసుకోవాలి. మెదడుకు శక్తిని పెంపొందించడానికి పెరుగు, కరివేపాకు, కాలీఫ్లవర్, బ్రోకలీ, సెలరీ, వాల్ నట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మెదడుకి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
ఈ కంప్యూటర్ యుగంలో రాత్రిపూట ఎక్కువ సేపు మొబైల్ ఫోన్, టీవీ, ఇతర గాడ్జెట్లు చూస్తూ లేటుగా నిద్రపోతుంటారు. నిద్రలేమి వల్ల కూడా జ్ఞాపకశక్తి మందగిస్తుంది. ఒత్తిడి, ఆందోళనల వల్ల కూడా మెదడుకి ఒత్తిడి పెరిగి జ్ఞాపకశక్తి తగ్గుతుంది. శరీరానికి, మెదడుకి విశ్రాంతి ఇవ్వటం వల్ల మెదడు పనితీరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకు ఇష్టమైన పనులు చేయడం మంచిది. వ్యాయామం చేయడం వల్ల కూడా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఉదయం, సాయంకాలం వేళల్లో వచ్చే సూర్యరష్మి లో విటమిన్ డి ఎక్కువగా అందుతుంది, ఈ సమయాలలో వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పుస్తకాలు చదవడం, ఆటలు ఆడటం, సరదాగా ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పడం వల్ల కూడా మనసుకి ప్రశాంతత కలిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.