Health Tips: లిప్ స్టిక్ ఎక్కువగా వాడుతున్నారా? జాగ్రత్త మీరు ప్రమాదంలో పడ్డట్టే…!

Health Tips: అందానికి ప్రతి రూపం ఆడవారు. మహిళలు అందంగా కనిపించడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అందంగా కనిపించడానికి వేల రూపాయలు ఖర్చు చేసి బయట మార్కెట్లో లభించే వివిధ రకాల బ్యూటీ పార్లర్ కొనుగోలు చేసిన అందానికి మెరుగులు దిద్దుతారు.తులం బయట మార్కెట్లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల అందంగా కనిపించినప్పటికీ ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు అయినప్పటికీ చాలామంది అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో వయస్సులో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు మేకప్ లేనిదే బయటకు వెళ్ళటం లేదు.

ముఖ్యంగా ప్రతిరోజు లిప్ స్టిక్ వేసుకోనిదే బయటకి వెళ్ళటం లేదు. ప్రతిరోజు లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రోమియం, మెగ్నీషియం, లెడ్ , కాడ్మియం, పెట్రో కెమికల్స్‌ను ఉపయోగించి లిప్ స్టిక్ తయారు చేస్తారు. ఇలా కెమికల్స్ తో తయారు చేసిన లిప్ స్టిక్ ప్రతిరోజు వేసుకోవటం వల్ల అవి శరీరంలోకి వెళ్లి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా లిప్ స్టిక్ లో ఉండే కాడ్మియం అనే కెమికల్ వల్ల కడుపులో కణతులు ఏర్పడటమే కాకుండా కిడ్నీలు దెబ్బతిని ప్రమాదం కూడా ఉంది.

లిప్ స్టిక్ తయారు చేయటానికి ఉపయోగించే కెమికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. లెడ్ కెమికల్ వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.తద్వారా మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. లిప్స్టిక్ లో ఉపయోగించే కెమికల్స్ వల్ల చాలా మందికి అలర్జీ, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కెమికల్స్ వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినే తెలివితేటలు మందగించే ప్రమాదం కూడా ఉంటుంది. అందం కోసం ఉపయోగించే లిఫ్టిక్ కారణంగా ఇన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.అందువల్ల ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పూల ద్వారా తయారు చేసుకొని వినియోగించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.