Kidney Problems: ప్రస్తుత కాలంలో జీవనశైలిలో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలు ఈ మధ్యకాలంలో బాగా అధికమయ్యాయి. దీనికి కారణం మనం తీసుకునే ఆహారం. మన శరీర అవయవాలలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనం తిన్న ఆహారం జీర్ణం చేసి మలినాలను, వ్యర్ధాలను మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపిస్తాయి. కొన్ని రకాల ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మూత్రపిండాల సమస్యలు రావడానికి ముఖ్య కారణం మద్యపానం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మద్యపానానికి బాగా అలవాటు పడుతున్నారు. మనిషి జీవితంలో రోజు ఆహారం తీసుకోవటం ఎంత పరిపాటిగా ఉంటుందో ఈ మధ్యకాలంలో ఆల్కహాల్ కూడా అలాగే తీసుకుంటున్నారు. మద్యం ఎక్కువగా తాగటం వల్ల కిడ్నీలు చెడిపోయి కిడ్నీ సమస్యలు వస్తాయి. దీని ప్రభావం మెదడు మీద కూడా ఉంటుంది.మద్యపానం సేవించడం వల్ల కిడ్నీ సమస్యలు మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
ఇంట్లో ప్రతిరోజు పాలను తప్పనిసరిగా ఉపయోగిస్తాం. ప్రతిరోజు పాలు, పాల ఉత్పత్తులు అధికంగా తినటం వల్ల అందులో ఉండే క్యాల్షియం కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. పాలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల అవి జీర్ణం కావటానికి కిడ్నీలు చాలా కష్టపడాల్సి వస్తుంది.ప్రతి రోజు అధిక మొత్తంలో పాలు, పాల ఉత్పత్తులు తీసుకుంటే కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
మనం ప్రతి రోజూ వంటలో ఉప్పును తప్పనిసరిగా ఉపయోగిస్తాము. ఉప్పు వేయకుండా ఏ ఆహార పదార్థాలను కూడా తినలేము. తగిన మోతాదులో ఉప్పు తీసుకోవటం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ అధిక మోతాదులో ప్రతిరోజూ ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో ద్రవం పెరిగిపోయి కిడ్నీ మీద ప్రభావం చూపుతుంది.అంతేకాకుండా ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల బిపి సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
ఎరుపు రంగులో ఉన్న మాంసాహారంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎరుపు రంగులో ఉన్న మాంసాహారం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ కన్నా అధిక మొత్తంలో ప్రోటీన్స్ అందుతాయి. వీటిని జీర్ణం చేయటానికి కిడ్నీలు ఎక్కువ శ్రమ తీసుకోవలసి వస్తుంది. అంతేకాకుండా కృత్రిమ స్వీట్నార్లు ఉండే కూల్ డ్రింక్ ,స్వీట్లు,కుకులి వంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.