Health Rashes: ఎండాకాలం హీట్ ర్యాషెస్ సమస్యలతో బాధపడుతున్నారా..ఈ వంటింటి చిట్కాలను పాటించాల్సిందే..?

Health Rashes: ఎండాకాలం మొదలయ్యింది. ఈ ఎండాకాలంలో చాలామంది హీట్ ర్యాషెస్ తో బాధపడుతూ ఉంటారు. చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఈ హీట్ ర్యాషెస్ లాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇవి ఎక్కువగా మెడ, లేదా వీపు భాగాల్లో వస్తూ ఉంటాయి. వీటి కారణంగా దురద మంట ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ హీట్ ర్యాషెస్ నుంచి బయటపడడానికి ఈ మార్కెట్లో అనేక రకాల పౌడర్లు,క్రీమ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి కొంతవరకు మాత్రమే ఉపశమనాన్ని కలిగిస్తాయి. మరి హీట్ ర్యాషెస్ లను తగ్గించే కొన్ని హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే హోమ్ రెమెడీస్ చాలా సమర్థవంతంగా ప్రభావితంగా పనిచేస్తాయి. వాటిలో ముఖ్యమైనది దోసకాయ. దోస కాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి కాసేపు ఫ్రిజ్ లో పెట్టి, అవి చల్లబడిన తర్వాత వాటిని తీసుకొని ఆ హీట్ ర్యాషెస్ పై ఇద్దరం వల్ల అవి కొద్దిరోజుల్లోనే తగ్గిపోతాయి. అలాగే ముల్తానీ మట్టిని హీట్ ర్యాషెస్ ఉన్న చోట అప్లై చేయడం వల్ల దురదలు మంటలు లాంటివి తగ్గుతాయి. ముల్తానీ మట్టిని రోజ్ వాటర్లో కలిపి పేస్ట్ లా చేసుకొని హీట్ ర్యాషెస్ పై అప్లై చేయడం వల్ల మంటలు దురదలు త్వరగా తగ్గుతాయి.

అలాగే అలోవెరా జెల్ ని ఆ హీట్ ర్యాషెస్ పై రాత్రి పడుకునే సమయంలో అప్లై చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఈ అలోవెరా జెల్ ని ఫ్రిజ్లో ఉంచి చల్లబడిన తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక విధంగా కొబ్బరి నూనెను హీట్ ర్యాషెస్ పై అప్లై చేయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా శనగపిండిని చల్లని నీటిలో కలిపి పేస్టులా చేసి ఆ వేడిదద్దుర్ల పై అప్లై చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా 2,3 ఐస్ క్యూబ్ లను క్లాత్ లో పెట్టుకుని హీట్ ర్యాషెస్ పై అప్లై చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.