Sleep Tips: ఈ ఆధునిక కాలంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం , పని ఒత్తిడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక మనిషి ఆరోగ్యం వారు తీసుకుని ఆహారం , నిద్రపోయే సమయం మీద ఆధారపడి ఉంటుంది.. అలాగే ఒక మనిషి రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటల తప్పనిసరిగా నిద్ర పోవాలి. ఈ ఉరుకులు , పరుగుల జీవితంలో సంపాదనలో పడి సమయానికి తిండి తినక , నిద్రపోక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా యువత టెక్నాలజీ పెరగటం వల్ల రోజులో ఎక్కువ సమయం లాప్ టాప్ స్మార్ట్ ఫోన్ కు బాగా ఆడిట్ అయిపోయారు. ప్రస్తుత కాలంలో అందరిని వేధిస్తున్న అనారోగ్య సమస్యలలో నిద్రలేమి సమస్య ఒకటి.. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవటంవల్ల నిద్రలేమి సమస్యను దూరం చేయవచ్చు. ప్రస్తుత చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు బయట ఫాస్ట్ ఫుడ్స్ , జంక్ ఫుడ్స్ తినడానికి బాగా అలవాటు పడిపోయారు. ఇలాంటి ఆహారంలో ఎక్కువగా మసాలాలు వేయటం వలన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య మొదలవుతుంది. అందువలన రాత్రి నిద్ర పోవడానికి ముందు ఎటువంటి ఫాస్ట్ ఫుడ్స్ , మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం , కాఫీ , టీ వంటి ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే మంచిది.
ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. అలాగే పాలలో ఒక టేబుల్ స్పూన్ తేనే కలిపి తాగడం వలన హాయిగా నిద్రపడుతుంది.
ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక అరటిపండు తినడం వలన తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. అరటిపండులో పొటాషియం , మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అందువలన కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తొలగి పోయి హాయిగా నిద్ర పడుతుంది.
పగలంతా పని చేసి అలసిపోయి ఉంటారు . నిద్రపోయే ముందు ప్రతిరోజు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వలన శరీరం మెదడు రిలాక్స్ అయి నిద్ర బాగా పడుతుంది. ఎటువంటి పరిస్థితులలో నిద్రపోయే ముందు కాఫీ , టీ , జంక్ ఫుడ్ లాంటివి తీసుకోకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి వేళ తేలికపాటి ఆహారం తీసుకోవటం వలన నిద్ర బాగా పట్టి ఆరోగ్యం మెరుగుపడుతుంది.