Health Tips: ప్రస్తుత సమాజంలో మనుషులు ఉరుకుల పరుగుల జీవితంలో గడిపేస్తున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు వారికి తెలియకుండానే ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. వాటిలో వినికిడి లోపం కూడా ఒకటి. చాలా మంది వారి ఉరుకుల పరుగుల జీవితంలో వారికి తెలియకుండానే ఈ వినికిడి లోపానికి గురవుతున్నారు. అయితే అందుకు గల కారణాలు కూడా లేకపోలేదు.. సౌండ్ ఎక్కువగా పెట్టుకొని టీవీలు చూడటం, సౌండ్ ఎక్కువగా పెట్టుకొని పాటలు వినడం, పెద్ద పెద్దగా మాట్లాడడం లాంటివి వినికిడి లక్షణాలుగా చెప్పవచ్చు. అయితే ఈ వినికిడిలోపాన్ని సకాలంలోనే గురించి చికిత్సలు తీసుకోవడం వల్ల ఆ సమస్య పెద్దది కాకుండా చూసుకోవచ్చు.
మామూలుగా అయితే వయసు ఎక్కువగా ఉన్నవారికి వినికిడి లోపం ఏర్పడుతూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మాటలు సరిగ్గా వినిపించవు. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి వినికిడి లోపం రావడానికి ఇంకా ఏ ఏ కారణాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. స్నానం చేసిన తర్వాత చాలామంది చెవులను తడిగా ఉంచుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చెవులు పొంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే ఈ సమస్య బయట బావులు, చెరువులకు ఈతకు వెళ్లిన వారిలో బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ కి కారణం ఆస్పర్ గిల్లస్, కాండిడా అనే ఒక బ్యాక్టీరియా.
అలాగే చాలామందికి పాటలు వినడం అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే చాలామంది హెడ్ సెట్, ఇయర్ ఫోన్స్ లాంటివి పెట్టుకొని ఎక్కువ శబ్దం పెట్టుకొని వింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ శబ్దం చెవి పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. అలాగే చెవిలో పాటలు వినడం కోసం రకరకాలుగా ఎలక్ట్రికల్ వస్తువులను వాడుతూ ఉంటారు. అలా ఉపయోగించకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు అదేవిధంగా స్నానం చేసేటప్పుడు చెవిలో నీళ్లు పోయడం మంచిది కాదు. అదే విధంగా పెద్ద పెద్ద శబ్దాలు దగ్గర పని చేసేటప్పుడు చెవిలో దూది పెట్టుకోవడం మంచిది. పాటలు, టీవీలు ఎక్కువగా సౌండ్ పెట్టుకుని వినవద్దు.