Hair Fall: ఈ ఆధునిక ప్రపంచంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఏదైనా ఉందా అంటే అది జుట్టురాలే సమస్య. మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వాతావరణ కాలుష్యం వల్ల ఈ జుట్టు రాలే సమస్య ఇంకా పెరుగుతుంది. జుట్టు రాలకుండా ఉండటానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో వేరేగా చెప్పనక్కర్లేదు. మగవారు బట్టతల వస్తుందేమోనని బాధపడుతుంటారు. బట్ట తల వచ్చిన చాలా మంది పురుషులు టోపీ పెట్టుకొని కవర్ చేస్తుంటారు. కానీ ఆడవారికి జుట్టు రాలిపోతుంటే వారి బాధ వర్ణనాతీతం. ఆడవారు జుట్టు లేకుంటే చాలా అందవిహీనంగా కనిపిస్తాము అని బాధపడుతుంటారు. అయితే కొందరి లో జుట్టు పెరగదు లేదా తక్కువ పెరుగుతుంది, కొందరిలో చిట్లిపోతుంది. అయితే మనం రోజూ తినే ఆహార పదార్థాల వల్ల కూడా జుట్టు రాలడం ఆధారపడి ఉంటుంది.
అయితే మనం రోజూ వివిధరకాల ఆహార పదార్థాలు తింటూ ,పానీయాలు తీసుకుంటాం. అయితే వీటిలో కొన్ని జుట్టు కి మేలు చేసేవి కాగా మరి కొన్ని హాని చేసేవి ఉంటాయి. జుట్టుకి ఏ పదార్థాలు మేలు చేస్తాయో , ఏవి హాని చేస్తాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ఒక లుక్ వేయండి.
మధ్యపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. అయితే మద్యపానం చేయడం వల్ల కెరాటిన్ పై ప్రభావం పడుతుంది. కెరాటిన్ వలన జుట్టుకి కావలసిన ధృడత్వం ఇంకా పటుత్వం లభిస్తాయి. మధ్యపానం సేవించే వారిలో జుట్టు రాలే సమస్యలు కొంచెం అధికంగా ఉంటాయి.
కోడి గుడ్లు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలుసు. కోడిగుడ్డు ప్రతి రోజు తినటం వల్ల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అయితే ఇవి ఉడకపెట్టి లేదా వేరే ఎలా తీసుకున్నా మంచిది. పచ్చి గుడ్లు తినడం వల్ల శరీరంలో కెరటిన్ లెవెల్స్ తగ్గిపోయి జుట్టు రాలడం జరుగుతుంది.
చేపలు తినడం వల్ల మనిషికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చేపలు తినడం వల్ల గుండె సమస్యలు కూడా దూరం చేయవచ్చును. అయితే ఇవి వారం లో రెండు సార్లు తినడం వల్ల చాలా ఆరోగ్యం, కానీ అంతకన్నా ఎక్కువ తినడం వల్ల దుష్ప్రభావాలు మొదలవుతాయి. చేపలు ఎక్కువగా తినడం వల్ల జుట్టు రాలుతుంది.
ఈ ఆధునిక కాలం లో అందరూ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరి ఐటమ్స్ ఎక్కువగా తింటుంటారు. ఇటువంటి ఆహారం తీసుకోవటం వల్ల జుట్టు రాలిపోయే సమస్య అధికవుతుంది. కూల్ డ్రింక్స్, ఇతర శీతల పానీయాలు తాగడం వలన కూడా జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.
చక్కెర పదార్థాలు, స్వీట్లు తినడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఎందుకంటే చక్కెరలో ఇన్సులిన్ నిరోధకతను పెంచగల గుణం ఉంటుంది. ఇది డయాబెటీస్ కి కారణం అవుతుంది. చక్కెర పదార్థాలు వాడకం తగ్గించి పీచు పదార్థాలు తినడం వల్ల మీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీ షుగర్ లెవెల్స్ నీ వెంటనే పెంచే ఆహారపదార్థాలు తీసుకోకపోవడం మంచిది.