సాధారణంగా ప్రతిరోజు ఉదయం లేవగానే టీ తాగటం చాలామందికి బాగా అలవాటు. అయితే టీ కాఫీ ఎక్కువ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందువల్ల అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి హెర్బల్ టీ తాగటానికి ఆసక్తి చూపుతున్నారు. హెర్బల్ టీ అనేక రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా గ్రీన్ టీ, జింజర్ టీ వంటి హెర్బల్ టీ ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ దాల్చిన చెక్కతో తయారు చేసిన హెర్బల్ టీ గురించి ,దాని రుచి, ఆరోగ్య ప్రయోజనాలు గురించి చాలామందికి అవగాహన ఉండదు. దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
ముందుగా దాల్చిన చెక్కతో టీ తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి నాలుగు దాల్చిన చెక్కలను వేసి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని ఒక గ్లాసులో వడపోసి అందులో ఒక హెర్బల్ టీ బ్యాగ్ మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని తాగాలి. ఇలా తయారు చేసుకున్న దాల్చిన చెక్క టీ ని ప్రతిరోజు తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. హెర్బల్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్కతో తయారుచేసిన హెర్బల్ టీ తాగటం వల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటు ఫ్రీ రాడికల్ సమస్యలు కూడా నివారించవచ్చు.
ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు ఈ దాల్చిన చెక్కతో తయారు చేసిన హెయిర్ క్వాలిటీ తాగటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడమే కాకుండా శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించి శరీర బరువు తగ్గించటంలో ఈ టీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా హెర్బల్ టీ ఎంతో ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కతో తయారుచేసిన హెర్బల్ టీ తాగటం వల్ల వృద్ధాప్యం వల్ల వచ్చే ముడతలు నివారిస్తుంది. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.