ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో థైరాయిడ్ ఒకటి. హార్మోన్ల ఇమ్ బ్యాలెన్స్ వల్ల చాలామంది ఈ వ్యాధి బారిన పడతారు. ఒకసారి ఈ వ్యాధి బారిన పడితే ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే కొన్ని డ్రింక్స్ తీసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యను సులువుగానే దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఇప్పటికే థైరాయిడ్ కు మందులు వాడుతున్న వారు క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ తాగితే మంచిది. మజ్జిగ కూడా యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసే అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ మజ్జిగ తాగడం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మజ్జిగలో ఉండే ప్రో బయోటిక్స్ వల్ల హైపోథైరాయిడిజంలో మంటను తగ్గించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
యాపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవడం ద్వారా థైరాయిడ్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ స్రావాన్ని సైతం యాపిల్ సైడర్ వెనిగర్ సులువుగా నియంత్రిస్తుందని చెప్పవచ్చు. బాదంపాలు తాగడం ద్వారా కూడా థైరాయిడ్ తో బాధ పడేవాళ్లకు బెనిఫిట్ కలుగుతుంది. పాలు, పసుపు కలిపి తాగటం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
అశ్వగంధ, శతావరి థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. ఖాళీ కడుపుతో హెర్బల్ టీ తాగడం ద్వారా కూడా ఎన్నో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. థైరాయిడ్ సమస్యతో బాధ పడేవాళ్లు ఈ విషయాలను గుర్తు పెట్టుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.