Health Tips:సాధారణంగా ఈ రోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన శైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది. అతి చిన్న వయసులోనే ఈ మధ్యకాలంలో చాలా మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. చాలా మంది ప్రజలు ఛాతిలో నొప్పి పుట్టగానే అది గుండె నొప్పి అనుకొని భ్రమపడి కూడా అనారోగ్యం పాలవుతున్నారు.కానీ కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా చాతిలో నొప్పి పుట్టే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా ఈ రోజుల్లో పని ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తినకపోవడం వల్ల అందరికీ గ్యాస్ట్రిక్ సమస్యలు వేధిస్తున్నాయి. శరీరంలో గ్యాస్ట్రిక్ సమస్య వచ్చినప్పుడు కూడా ఛాతి నొప్పి, కడుపు నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. అందువల్ల ఛాతీలో నొప్పి పుట్టగానే భయపడకుండా డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది.
శరీరంలో రక్త శాతం తక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. కొంతమందిలో ఈ రక్తహీనత సమస్య వల్ల అన్ని శరీర భాగాలకు రక్త సరఫరా జరగకపోవటం వల్ల కూడా ఛాతిలో నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు సూచిస్తున్నారు.
కొన్ని సందర్భాలలో ఊపిరితిత్తుల్లో వాపు రావడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టతరంగా మారుతుంది.ఈ సమయంలో జలుబు దగ్గు వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా చాతిలో నొప్పి పుట్టే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పక్కటెముకలలో బాపు రావడం వల్ల కూడా చాతిలో నొప్పి కలిగే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. చాతిలో నొప్పి కలిగిన వెంటనే దగ్గరలోని డాక్టర్ ని సంపాదించడం మంచిది.