Health Tips: జిమ్ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? జాగ్రత్త ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది..!

Health Tips: ప్రస్తుత కాలంలో అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకుంటూ వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొంతమంది జిమ్ కి వెళ్లి వ్యాయామాలు చేసేటప్పుడు వాటి గురించి పూర్తిగా అవగాహన లేకుండా పొరపాట్లు చేయటం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారికి కూడా హార్ట్ ఎటాక్ వస్తోంది. జిమ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

జిమ్ లో వ్యాయామాలు చేసేటప్పుడుజాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కండరాల మీద ఒత్తిడి పడి హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. జిమ్ చేసేవారు కొన్ని జాగ్రత్తలను పాటించటం వల్ల హార్ట్ ఎటాక్ ల బారిన పడకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జిమ్ కి వెళ్లి వ్యాయామాలు చేసేవారు వ్యాయామాలు ప్రారంభించటానికి ముందు 10 నుండి 15 నిమిషాల పాటు వార్మప్ చేయాలి.

శరీర బరువుకు అనుకూలమైన వ్యాయామాలు చేయాలి. అంతేకాకుండా అధిక బరువులు ఎత్తడం వల్ల కండరాలు పట్టుకు పోయే ప్రమాదం ఉంటుంది. వ్యాయామాలు చేసేటప్పుడు అదే పనిగా గంటల తరబడి విశ్రాంతి లేకుండా వ్యాయామాలు చేయకుండా 10 నుంచి 15 నిమిషాలు వ్యాయామం చేసిన తర్వాత కొంత సమయం రిలాక్స్ అయి తర్వాత వ్యాయామాలు మొదలు పెట్టాలి. వ్యాయామాలు చేసేటప్పుడు మధ్యమధ్యలో ఎనర్జీ డ్రింక్ తాగుతూ ఉండాలి.

జిమ్ చేసే ముందు కనీసం 5-10 నిమిషాల పాటు వార్మప్ చేయాలి. చేతులను, కాళ్లను, ఇతర శరీర భాగాలను సున్నితంగా ఆడిస్తూ.. అటు, ఇటు తిప్పుతూ వ్యాయామం చేసినట్లు నెమ్మదిగా చేయాలి. దీంతో శరీరంపై సడెన్‌గా ఒత్తిడి పడదు. శరీరం వ్యాయామం చేసేందుకు సిద్ధమవుతుంది. ఇక వ్యాయామాన్ని అదే పనిగా చేయరాదు. 20 నుంచి 30 నిమిషాల పాటు చేసి తరువాత 10 నుంచి 15 నిమిషాలు విరామం ఇవ్వాలి. ఆ తరువాత 20 నిమిషాలు చేయాలి. ఈ విధంగా మధ్యలో విరామం తీసుకుంటూ జిమ్ చేయాలి. దీంతో శరీరం.. ముఖ్యంగా గుండెపై ఒత్తిడి పడదు. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించవచ్చు. లేదంటే గుండెపై అధికంగా ఒత్తిడి పడి అది హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుందని.. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. వైద్యులు సూచిస్తున్నారు.