మొలలు వస్తే కూర్చోవడం, ప్రయాణించడం, బాత్రూం కి వెళ్లడం చాలా కష్టం. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అని కోరుకుంటాం అంటే దీని తీవ్రత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలద్వారంలో సున్నితమైన రక్తనాళాలు దెబ్బ తినడం ద్వారా వచ్చేది మొలలు.దీనినే మూలశంక అని కూడా అంటారు.
మొలలు అనేది సాధారణంగా ఎక్కువగా ఒకటే చోట కూర్చుని పని చేసేవారిలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి, మద్యం సేవించడం ఎక్కువ అయితే కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. నీరు తక్కువగా తాగిన, మాంసాహారం, జంక్ ఫుడ్ బయట ఎక్కువగా తిన్నా కూడా వచ్చే అవకాశం ఉంది. గట్టిగా తగ్గేవారికి కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు ఎప్పుడు చిరాకుగా, అసౌకర్యంగా కనిపిస్తుంటారు.
ఇలాంటి అలవాట్లు ఉన్న వారిలో రక్తనాళాలు వాచిపోయి మలవిసర్జన సమయంలో నొప్పి,మంట ఇంకా రక్తం కూడా వచ్చే అవకాశం ఉంది. మొలలు వచ్చిన వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. దీనితో బాధపడే వారికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. రక్తం రావడం చేత రక్తహీనత ఏర్పడి నీరసంగా ఉంటారు.
మొలలు వచ్చినవారు శరీరానికి వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కారం, మసాలాలు, ఆవకాయ, వేపుళ్ళు, చింతపండు దుంప లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు పీచు పదార్థం ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు తినాలి. ఈ వ్యాధితో బాధపడేవారు నీటిని ఎక్కువగా తాగడం వల్ల మలవిసర్జన సమయంలో కాస్త నొప్పి, మంట తక్కువగా ఉండే ఆస్కారం ఉంది.
ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని వైద్యుని సలహాలు పాటిస్తూ చక్కగా ఈ వ్యాధి నుండి బయటపడవచ్చు.