ఇంటిలో శాంతి కోరే ప్రతి ఒక్కరూ వాస్తు శాస్త్రాన్ని ఎంతో నమ్ముతారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణ సమయంలో హాల్, బెడ్‌రూమ్, కిచెన్, బాత్రూమ్ వంటి ముఖ్యమైన విభాగాల్లో వాస్తు నిపుణుల సలహాలను పాటిస్తుంటారు.. అయితే స్థలం పరిమితంగా ఉండటం, ఉపయోగకరంగా మార్పులు చేయాలనే ఉద్దేశంతో కొన్ని నిర్మా నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా.. నిర్మాలు చేస్తుంటారు.. వాటిలో ముఖ్యమైనది మెట్ల కింద బాత్రూమ్ కట్టడం.
చిన్నచిన్న ఇళ్లలో మెట్ల కింద ఉండే ఖాళీ స్థలాన్ని వృథా చేయకూడదనే ఆలోచనతో అక్కడ టాయిలెట్‌ను ఏర్పాటు చేస్తుంటారు. అయితే వాస్తు నిపుణుల ప్రకారం ఇదే ఒక భయంకరమైన వాస్తు దోషంగా మారుతుంది. మెట్ల కింద టాయిలెట్ ఏర్పాటు చేయడం వలన ఇంట్లో శుభశక్తులు తొలగిపోతాయని, ప్రతికూల శక్తులు చొచ్చుకు వస్తాయని వారు చెబుతున్నారు.
ఇలాంటి నిర్మాణం వల్ల ఇంటి యజమానుని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని, మానసిక ఒత్తిడి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణుల హెచ్చరిక. అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, వ్యయభారం పెరగడం, ఆదాయ మార్గాల్లో ఆటంకాలు వంటి సమస్యలు కూడా కనిపించే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
అయితే ఇప్పటికే అలా నిర్మించబడి ఉన్న ఇళ్ల కోసం కొన్ని పరిహార మార్గాలు వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు బాత్రూమ్‌లో ఒక గిన్నెలో ఉప్పును ఉంచడం ద్వారా నెగటివ్ ఎనర్జీ తగ్గే అవకాశం ఉందని నమ్మకం. ఆ ఉప్పును వారానికి ఒకసారి మార్చడం అవసరం. అలాగే టాయిలెట్‌లో వాస్తు యంత్రం లేదా క్రిస్టల్ బాల్ ఉంచడం వల్ల అక్కడ శుభ శక్తి ప్రవహించేందుకు సహకరిస్తుందని అంటున్నారు.
ఇంకా నీలిరంగు బకెట్‌ను ఉపయోగించడం, చిన్న అద్దాన్ని బాత్రూమ్‌లో ఉంచడం, పచ్చని మొక్కలతో అలంకరించడం వంటి చిన్నచిన్న మార్పులు కూడా పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయని అభిప్రాయం. శుభతతో కూడిన ఫోటో ఫ్రేములు లేదా శాంతిని సూచించే చిత్రాలను టాయిలెట్‌లో ఉంచడం ద్వారా ఆ స్థలంలో శాంతిని కలిగించవచ్చని నిపుణులు తెలిపారు.
వాస్తు ఒక శాస్త్రం మాత్రమే కాదు, అది ఇంట్లో శాంతిని, ఆరోగ్యాన్ని, సంపదను, మనసు స్థితిని ప్రభావితం చేసే శక్తిగా నమ్ముతున్నారు. అందుకే ఇల్లు నిర్మించే సమయంలో చిన్న స్థలాన్ని పొదుపుగా వాడాలన్న ఆలోచనలో, శాస్త్రాన్ని తక్కువ అంచనా వేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెట్ల కింద బాత్రూమ్ నిర్మించడం కన్నా, వాస్తు నిపుణుల సలహాతో ప్రత్యామ్నాయ ప్లాన్ సిద్ధం చేసుకోవడం మేలు. ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా జీవించాలంటే ఈ చిన్న విషయాలకూ ప్రాధాన్యం ఇవ్వడం అవసరమని స్పష్టంగా చెబుతున్నారు. (గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు సంప్రదాయ నమ్మకాలు మరియు వాస్తు నిపుణుల సూచనల ఆధారంగా రాసినది.. తెలుగు రాజ్యం దీనిని ధృవీకరించడం లేదు.. ఏదైనా ఆచరించేముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.)