Dhanurmasam 2021: మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ క్రమంలోనే కార్తీకమాసం తర్వాత వచ్చే మాసాన్ని మార్గశిరమాసం అంటాము.ఇకపోతే డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం కావడంతో ఈ నెల మొత్తం పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ నెల మొత్తం శుభకార్యాలకు నిషేధం అని చెబుతుంటారు. అసలు ధనుర్మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదనే విషయానికి వస్తే…
డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం కావడంతో సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడు. ఈ క్రమంలోనే గమనం నెమ్మదిగా ఉంటుంది. బృహస్పతి ప్రభావం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ నెలలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదుని చెబుతారు. సూర్యుని గమనం జనవరి 14న మకరరాశిపై ప్రభావం చూపుతుంది.14వ తేదీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక ఆ తర్వాత మకర రాశి వారిపై శని ప్రభావం ఉంటుంది. అందుకే ధనుర్మాసంలో ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేయరు.
కేవలం శుభకార్యాలు మాత్రమే కాకుండా ధనుర్మాసంలో ఏ విధమైనటువంటి నూతన వస్తువులను కూడా కొనుగోలు చేయకూడదు. ఇంటి స్థలాలు కొత్త వాహనాలు కొత్త ఇంటిని కూడా ఈ నెలలో కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. కొత్త వస్తువులను స్థలాలను కొనుగోలు చేయడం వల్ల వారిలో సుఖసంతోషాలు ఉండవని పండితులు తెలియజేస్తున్నారు. అందుకోసమే ధనుర్మాసంలో శుభకార్యాలు కానీ నూతన కొనుగోలు గాని చేయకూడదు.