Villains: మామూలుగా సినిమా ఇండస్ట్రీలు హీరోలు హీరోలుగా విలన్లుగా నటించడం అన్నది కామన్. కొన్ని కొన్ని సార్లు పాత్రలు డిమాండ్ చేసినప్పుడు విలన్లు హీరోలుగా హీరోలు విలన్ గా నటించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటులు ఒకప్పుడు సినిమాలలో స్టార్ హీరోలుగా రాణించి ప్రస్తుతం మాత్రం స్టార్ విలన్లుగా రాణిస్తున్నారు. మోస్ట్ బిజిఎస్ట్ విలన్ గా మారిపోయారు. చేతినిండా వరుసగా సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అరవింద్ స్వామి.. ఒకప్పుడు ఆయన లవ్ స్టోరీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే బిజినెస్ రంగంలో కూడా బాగా రాణించారు. ఆ తర్వాత మళ్లీ రాంచరణ్ హీరోగా నటించిన ధ్రువ సినిమాలో విలన్ గా నటించి తిరిగి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఎక్కువగా విలన్ క్యారెక్టర్లలో నటిస్తున్నారు అరవిందస్వామి.
అప్పట్లో ఫ్యామిలీ తరహా సినిమాలలో ఎక్కువగా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో జగపతిబాబు ముందు వరుసలో ఉంటారు అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా, లవ్ సినిమాలలో ఎక్కువగా నటించిన జగపతిబాబు ఇప్పుడు మాత్రం రూటు పూర్తిగా మార్చేసి కేవలం విలన్ క్యారెక్టర్లు మాత్రమే చేస్తున్నారు. స్టార్ హీరోలకు దీటుగా విలన్ క్యారెక్టర్ లో నటిస్తూ భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు జగపతిబాబు.
మరొక హీరో రవి కిషన్ శుక్ల. అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి గా నటించి తన విలనిజాన్ని చూపించారు. ఇక అప్పటినుంచి ఈయనకు వరుసగా విలన్ అవకాశాలు వస్తున్నాయి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈయన ఒకప్పటి హీరో. భోజ్ పురి హిందీ లాంటిది ఎన్నో సినిమాలలో హీరోగా నటించి మెప్పించారు.
అలాగే మరో హీరో శ్రీకాంత్. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. కానీ ప్రస్తుతం మాత్రం విలన్ గా సినిమాలలో నటిస్తూ నడిపిస్తున్నారు.