Health Tips: వేప ఆకుల వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వేపాకులు శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి.వాతావరణంలో సంభవించే మార్పుల కారణంగా అనేక రకాల చర్మ సంబంధిత వ్యాధులు తలచు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో చర్మం పొడిబారటం, దురద, అలర్జీ ఇటువంటి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.చలికాలంలో చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి వేపాకుల కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వేపాకు తో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం.
నీటిలో కొన్ని వేపాకులు వేసి బాగా మరిగించి ఆ నీటితో స్నానం చేయడం వల్ల కాలుష్యం వల్ల వచ్చిన మొటిమలు, వాటి తాలూకు మచ్చలు మొదలైనవి క్రమంగా తగ్గుముఖం పడతాయి. చుండ్రు సమస్యతో బాధపడేవారు తలస్నానం చేసేటప్పుడు వేడి నీటిలో కొన్ని వేపాకులు కొంచెం నిమ్మరసం కలిపి స్నానం చేయటం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది.
ముఖం మీద దుమ్ము ధూళి కణాలు పేరుకుపోవటం వల్ల మొటిమలు వస్తాయి. అలాంటి వారు స్నానం చేసేటప్పుడు గోరు వెచ్చని నీటిలో కొంచెం వేప నూనె కలుపుకుని స్నానం చేయడం వల్ల వారి సమస్య తగ్గుతుంది. చర్మం మీద అలర్జీ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా వేప నీటితో స్నానం చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.
శీతాకాలంలో ఎక్కువగా చర్మం పొడిబారుతుంది. అటువంటి సమయంలో స్నానం చేసే నీటిలో కొంచెం వేప నూనె వేసి స్నానం చేయడం వల్ల ఈ సమస్య తగ్గడమే కాకుండా చర్మం మృదువుగా తయారవుతుంది. ఇలా ప్రతిరోజు వేప నీటితో స్నానం చేయడం వల్ల శరీరం మీద పేరుకుపోయిన బ్యాక్టీరియా తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.