Health Tips: వేసవికాలంలో వేడి నీటితో స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Health Tips: వేసవికాలంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే వేడి భరించలేక భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు తట్టుకోలేక చాలామంది ఎల్లప్పుడు వాతావరణంలో ఉంటూ చల్ల చల్లని పాలు తాగుతూ శరీరాన్ని చల్లబరచుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. వేసవికాలంలో వేడి తీవ్రత భరించలేక దాదాపు అందరూ చన్నీటితో స్నానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గి
హాయిగా ఉంటుంది. కానీ వేసవి కాలంలో కూడా వేడి నీటితో స్నానం చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

సాధారణంగా చలికాలంలో వేడినీటితో, వేసవికాలంలో చన్నీటితో స్నానం చేయడం అందరికీ అలవాటు. కొద్ది మంది మాత్రం వేసవి కాలంలో ఆయన చలి కాలంలో వేడి నీటితోనే స్నానం చేస్తూ ఉంటారు. ఇలా వేసవి కాలంలో కూడా వేడి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా బయటకెళ్ళి పని చేయటం వల్ల వేసవి కాలంలో ఎక్కువ చిరాకుగా ఉంటుంది. ఒళ్లంతా పట్టేసినట్టు కండరాలు నొప్పులు ఉంటాయి. ఈ సమయంలో లో లో వేసవి కాలంలో కూడా వేడి నీటితో స్నానం చేయటం వల్ల కండరాలు రిలాక్స్ అయి కండరాల నొప్పులు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

వేసవి కాలంలో చాలామందికి శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది.అలాంటి వారు తరచూ చన్నీటితో స్నానం చేయడం వల్ల చర్మం మీద చిన్న చిన్న దద్దుర్లు, వేడి గుల్లలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారు స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు.

వేసవికాలంలో వేడి నీటితో స్నానం చేయటం ఎలా ఒత్తిడి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. చదరంగం వేసవికాలంలో చెమటలు పట్టి చర్మం జిడ్డుగా , చెమట వాసన తో అసౌకర్యంగా ఉంటుంది. అటువంటి సమయంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చర్మం మీద ఉన్న జిడ్డు మొత్తం తొలగిపోయి చర్మం శుభ్రంగా కాంతివంతంగా ఉంటుంది.