Black Coffee: ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఆనికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.ఈరోజుల్లో అందరిని ఎక్కువగా వేధిస్తున్న సమస్య లో అధిక బరువు సమస్య కూడా ఒకటి. ఈ సమస్యను అధిగమించటానికి చాలామంది వ్యాయామాలు చేస్తూ వారి ఆహార పద్ధతుల్లో మార్పులు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు హెర్బల్ టీ, బ్లాక్ కాఫీ వంటివి తాగటానికి ఆసక్తి చూపుతున్నారు. బ్లాక్ కాఫీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు చెందిన పరిశోధకులు బ్లాక్ కాఫీకి మీద పరిశోధన చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రోజుకు 2 నుంచి 3 కప్పుల బ్లాక్ కాఫీ తాగటం వల్ల అధిక బరువు సమస్య నుండి విముక్తి పొందవచ్చనీ, బ్లాక్ కాఫీ తాగితే శరీరంలోని 4 శాతం కొవ్వు కరిగించడానికి తెలియచేశారు. కనుక అధిక బరువును తగ్గించడంలో బ్లాక్ కాఫీ అద్భుతంగా పనిచేస్తుంది.
బ్లాక్ కాఫీ తాగటం వలన మానసిక ఒత్తిడి, బద్ధకం, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు బ్లాక్ కాఫీ తాగటం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభించి రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు, జిమ్ లో వర్కౌట్లు చేసేవారు ప్రతిరోజూ బ్లాక్ కాఫీ తాగటం వల్ల రోజంతా అలసిపోకుండా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అంతే కాకుండా ప్రతిరోజూ రెండు లేదా మూడు కప్పులు బ్లాక్ కాఫీ తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడి చురుగ్గా పనిచేస్తుంది.