Health Tips: ఉదయం లేచినప్పటి నుండి అనేక మంది అనేక రకాలుగా తమ తమ విధులు నిర్వహించడానికి బయట తిరుగుతూ ఉంటారు. అయితే బయట వాతావరణ కాలుష్యం అధికంగా ఉంటుంది. అనవసరంగా బయట తిరగకుండా ఇంట్లో ఉండటం వల్ల కాలుష్యం తక్కువగా ఉంటుంది అని చాలా మంది భావన. కానీ..ఇంటి లోపల కూడా కాలుష్యం ఉంటుంది, ఇది బయట కాలుష్యం కంటే ప్రమాదకారి. అయితే ఇండోర్ ప్లాంట్లు ఇంటిలో ఉన్న కాలుష్యాన్ని 20 శాతం వరకు తగ్గించగలవు అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బ్రిటన్ లోని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ పరిశోధకుల నేతృత్వంలో దీనిపైన ఒక అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం ప్రకారం ఇంటి లోపల అలంకరణ కోసం మొక్కలను నాటుతారు కానీ ఇవి ఇంటి లోపలి కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయని వారికి తెలియదు అని అన్నారు. పరిశోధకులు తమ అధ్యయనం కోసం పీస్ లిల్లీ, ఫెర్న్ అరమ్ అనే మొక్కలను ఉపయోగించారు. ఈ రెండు మొక్కలను ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డు పక్కన ఉన్న ఒక కార్యాలయంలో ఉంచారు. దీనిని ప్రతిరోజు పర్యవేక్షించగా ఆ కార్యాలయం లోపల ఉన్న నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిని తగ్గించగలవని కనుగొన్నారు.
డాక్టర్ క్రిస్టియన్ పిఫ్రాంగ్ మాట్లాడుతూ పరిశోధనకు ఉపయోగించిన రెండు మొక్కలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయని అన్నారు. అయినా సరే కార్యాలయంలో ఉన్న నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిని తగ్గించగలిగాయి అని ఆయన అన్నారు. ఇంటి లోపల కూడా మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట చేసే సమయంలో వెలువడే పొగ వల్ల కూడా ఇంట్లో కాలుష్యం ఉంటుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లోని కాలుష్యాన్ని తగ్గించడానికి క్రింద సూచించిన మొక్కలను ఉపయోగించడం శ్రేయస్కరం.
– పీస్ లిల్లీ
– బ్యాంబు పామ్
– స్నేక్ ప్లాంట్
– స్పైడర్ ప్లాంట్
– అరికా పామ్
– గర్బెర డైసీ
ఇవే కాకుండా వేప, మర్రి, జామూన్, పీపల్, అశోక అర్జున, మహువ, గన్నేరు, హర్సింగర్, మొదలైన సాంప్రదాయ చెట్లు కాలుష్యాన్ని తగ్గించగలవు. ఈ చెట్లను రోడ్డు పక్కన, నివాస ప్రాంతాలు దగ్గరలో నాటడం వల్ల ఇవి కాలుష్యాన్ని తగ్గించి గాలిని శుద్ది చేస్తాయి.