Betel Leaves: మన భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ప్రతి పూజలో తమలపాకులో కచ్చితంగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా సాంప్రదాయకరమైన ఆచారాలలో కూడా తమలపాకులు ఉపయోగించడం ఎన్నో ఏళ్ళ నుండి వస్తున్న ఆచారం. పూర్వకాలం నుండి తమలపాకులను శుభకార్యాలలో ఉపయోగించటం శుభప్రదంగా భావిస్తారు. అంతే కాకుండా వీటిని ఉపయోగించడం వెనక అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా మన భారతదేశంలో భోజనం తిన్న తర్వాత కిల్లి రూపంలో తమలపాకును తింటుంటారు.ఇలా భోజనం తర్వాత తమలపాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భోజనం తిన్న తర్వాత తమలపాకు నమలటం వల్ల ఇవి మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగపడుతాయి. అంతేకాకుండా నోటి దుర్వాసనకు కారణమైన క్రిములను తొలగించి నోటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.అందువల్ల ప్రాచీన కాలం నుండి మన పూర్వీకులు భోజనం తర్వాత తమలపాకు తినడం అలవాటు చేసుకున్నారు. తమలపాకు వల్ల నోటి సంరక్షణ మాత్రమే కాకుండా ఇంకా అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
తమలపాకులో విటమిన్-సి, క్యాల్షియం, ఫైబర్, పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు ఒకటి లేదా రెండు తమలపాకులు నమలడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి యాంటి ఆక్సిడెంట్స్ గా పని చేసి దగ్గు జలుబు వంటి వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడతాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు 2 మిరియాలు తమలపాకులో ఉంచి నమిలి తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
తమలపాకు లో ఉండే చెవికాల్ అనే పదార్థం యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్ గా పని చేసి శరీరంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను అరికడుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు తమలపాకులు తినటం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. రోజుకు ఒకటి లేదా రెండు కన్నా ఎక్కువ తమలపాకులు తినటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది.