Health Tips : ఈ వ్యాధితో బాధ పడేవారు అవకాడో తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

Health Tips: ప్రస్తుత కాలంలో అందరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలలో బీపీ షుగర్ వంటి సమస్యలు చాలా ప్రధానమైనవి. ఈ సమస్యలు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల్ని కూడా పట్టిపీడిస్తున్నాయి. అయితే షుగర్ వ్యాధితో బాధ పడేవారు ఆహారం తీసుకునే విషయంలో చాలా నియంత్రణలో ఉండాలి. లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు అవకాడో తినటం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అవకాడో తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా అన్ని రకాల పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల పోషకాలు ఉంటాయి. అలాగే అవకాడో లో కూడా షుగర్ వ్యాధిని నియంత్రించే గుణాలు ఉంటాయి.డయాబెటిస్ ఉన్నవారిలో ట్రైగ్లిజరైడ్స్ మరియు చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తొందరగా పెరగకుండా అవకాడో లోని కొన్ని పోషకాలు సహాయపడతాయి.అవకాడోలో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి.

షుగర్ వ్యాధితో బాధపడేవారికి నరాలు దెబ్బ తినకుండా అవకాడో లోని విటమిన్ B6 మరియు యాంటీఆక్సిడెంట్లు కాపాడుతాయి. అంతేకాకుండా నరాల బలహీనత సమస్యలు కూడా తగ్గిస్తాయి. అవకాడో ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అందులో ఉండే లుటీన్ అనే పదార్థం
డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ మాక్యులర్ ఎడెమా, కంటిశుక్లం వంటి కంటి సంబంధిత వ్యాధులను నివారించవచ్చు కంటిచూపును మెరుగుపరుస్తుంది.