Health Tips:గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల ప్రజలు అనేక సమస్యల బారిన పడుతున్నారు. ప్రజలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరం తరచూ డీహైడ్రేషన్ కి గురి అవ్వటం, నీరసం, కల్లు తిరగటం వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి.వేసవికాలంలో ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని పానీయాలు అద్భుతంగా పని చేస్తాయి. ఆ పనీయలేమిటో తెలుసుకుందాం.
• సాధారణంగా వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రతలు అదుపుచేయడానికి మజ్జిగ తాగుతుంటారు. మజ్జిగ అతి తక్కువ ధరలో అందరికి అందుబాటులో ఉంటుంది. వేసవి కాలంలో శరీరంలో వేడి తగ్గించడానికి మజ్జిగ బాగా పని చేస్తాయి.
• నిమ్మకాయలు కూడా వేసవి ఉష్ణోగ్రత తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. వేసవికాలంలో చల్లచల్లని నిమ్మరసం తాగటం వల్ల శరీరానికి కావాల్సిన తక్షణ శక్తి లభించి శరీరం డీహైడ్రేషన్ కి గురికాకుండా కాపాడుతుంది.
• సబ్జా గింజలు వేసవి ఉష్ణోగ్రతలు నుండి మనల్ని కాపాడటానికి ఎంతో ఉపయోగపడతాయి. సబ్జా గింజల లో శరీర ఉష్ణోగ్రతను అదుపు చేయగల శక్తి ఉంటుంది. అందువల్ల సబ్జా గింజల పానీయాలు తాగటం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించి వేడి నుండి మనల్ని కాపాడుతుంది.
• వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల నుండి కాపాడుకోవడానికి బెల్లం నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రోజు ఒక గ్లాస్ బెల్లం నీళ్లు తాగటం వల్ల కూడా శరీరంలో పెరిగిన వేడి తగ్గించవచ్చు.