Health Tips: బ్రోకలీ తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!

Health Tips: కూరగాయలలో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు ఇమిడి ఉంటాయి. ప్రతిరోజూ వాటిని ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. బ్రోకలీ అనే కూరగాయలు విదేశాలలో ఎక్కువగా వినియోగిస్తారు. ఈ బ్రోకలీ వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం మన భారతదేశంలో కూడా ఈ కూరగాయ వాడకం ఎక్కువ అవుతోంది . బ్రోకలీ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బ్రోకలీ తో మనం అనేక రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. వీటిలో ఐరన్, ప్రోటీన్, జింక్, కాల్షియం, ఫైబర్ , విటమిన్ ఏ, విటమిన్ సి వంటి మూలకాలు సమృద్ధిగా ఉంటాయి. బ్రోకలీ లో ఎక్కువగా 2.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు బ్రోకలీ తినటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపు చేస్తుంది. అందులో ఉండే ఫైబర్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించి అధిక బరువు సమస్యను దూరం చేస్తుంది.

క్యాన్సర్ నివారణకు కూడా బ్రోకలీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, యూరిన్ క్యాన్సర్ నిరోధించడంలో సహాయపడుతుందివీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఆర్థరైటిస్, అలర్జీ, ఉబ్బసం వంటి వ్యాధులను నిర్మూలించడానికి ఉపయోగపడతాయి. బ్రోకలీ లో విటమిన్ ఎ ఎక్కువ ఉండటం వల్ల కంటి చూపు సమస్యలు తగ్గించి కంటి చూపు మెరుగుపడేలా చేస్తుంది.