Health Tips: జీలకర్ర వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Health Tips: వంటింట్లో మనకు విరివిగా దొరికే వాటిల్లో జీలకర్ర కూడా ఒకటి. జీలకర్రను మనం రోజూ తినే వంటకాలలో తప్పకుండా వినియోగిస్తూ ఉంటారు. ఈ జీలకర్ర మసాలా దినుసుల్లో ఒక భాగం అని చెప్పవచ్చు. ఈ జీలకర్ర ను తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి అని నిపుణులు సూచిస్తున్నారు. జీలకర్ర గాయాలను నయం చేయడంతోపాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను బయటకు పంపించి వేస్తుంది. అలాగే జీలకర్ర యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు, ఉదరం కాలేయంలో ఏర్పడే ట్యూమర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మూలికలతో పాటు జీలకర్ర తో చేసిన నీటిని కూడా తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మతిమరుపు సమస్యను జీలకర్ర దూరం చేస్తుంది. అదేవిధంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర తినడం వల్ల జ్ఞాపకశక్తి మరింత పెరుగుతుంది. జీలకర్ర లోని మూలకాలు నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి.

అదేవిధంగా జీలకర్ర మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు, అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలకు మెరుగైన పోషణను అందించడానికి సహాయపడుతుంది. కోసం జీలకర్ర గింజలను రాత్రి నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో నీటిని తాగడం వల్ల రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా నానబెట్టిన జీలకర్రను కూడా తినాలి. జీలకర్రలో వుండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి సంబంధించిన సమస్యలకు చెక్ పెడతాయి. ఎక్కువగా మొటిమలతో బాధపడేవారు జీలకర్ర నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల రాంగ్ డైట్ వల్ల కలిగే ప్రభావం ఆరోగ్యంపైనే కాకుండా చర్మంపై కూడా ప్రభావాన్ని చూపించి ఉంటాయి. తద్వారా ముఖం పై మొటిమలు వస్తూ ఉంటాయి. అలా మొటిమలు తగ్గించడానికి జిలకర్ర ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల అందులో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ మూలకాలు మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి.