Health Tips: మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఆరోగ్యానికి మేలు చేసే కారకాలు ఖచ్చితంగా ఉంటాయి. కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యానికి అవసరమైన కొన్ని రకాల పోషకాలు కొబ్బరిలో పుష్కలంగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో కొబ్బెర బాగా పనిచేస్తుంది. సాధారణంగా చాలామంది పచ్చి కొబ్బెర తినటానికి ఇష్టపడతారు. కొబ్బెర తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది.విటమిన్ ఎ,బి,సి, థయామిన్, రైబోప్లెవిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము వంటి పోషకాలు కొబ్బెరలో మెండుగా ఉంటాయి.
కొబ్బెరలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను కరిగించి అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ జరగటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉండదు. డయాబెటిక్ పేషెంట్లు కొబ్బెర తినటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ సమస్యను నియంత్రిస్తుంది.
మనం తీసుకునే ఆహారంలో అప్పుడప్పుడు కొబ్బెర చేర్చుకోవడం వల్ల అందులో ఉండే క్యాల్షియం ఎముకలు , దంతాలు దృఢంగా ఉండేలా చేస్తుంది. మూర్ఛ, అల్జీమర్స్ వంటి మెదడుకు సంబంధించిన నుండి కొబ్బరి కాపాడుతుంది.మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు వారు తీసుకునే ఆహారంలో కొబ్బెర తీసుకోవటం వల్ల ఈ సమస్యలు అరికట్టవచ్చు.