Health Tips: సాధారణంగా పల్లెటూర్లలో తెల్ల జిల్లేడు చెట్టు నీ పవిత్రంగా పూజిస్తారు. తెల్ల జిల్లేడు పువ్వులను పూజలు ఎక్కువగా వినియోగిస్తారు. ముఖ్యంగా వినాయకుడికి ఇష్టమైన ఈ తెల్ల జిల్లేడు పూలను వినాయక చవితి రోజు అలంకరించి పూజ చేస్తారు. ఈ తెల్ల జిల్లేడు ఆకుల లో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తెల్ల జిల్లేడు ఆకులను ఆయుర్వేదం లో కూడా విరివిగా ఉపయోగిస్తారు. తెల్ల జిల్లేడు ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తెల్ల జిల్లేడు ఆకులను తెంపేటప్పుడు జాగ్రత్తగ తీయాలి. వాటి పాలు చాలా విషపూరితమైన. అవి కంట్లో పడితే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ తెల్ల జిల్లేడు ఆకులు ఎంతొ ఉపయోగపడతాయి.
జిల్లేడు ఆకులకు ఆముదం రాసి కొంచం వేడి చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో ఆ ఆకు కట్టు కట్టాలి. ఒక వారం రోజుల ఇలా చేయటం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. జిల్లేడు ఆకులు,పసుపు, ఉప్పు వేసి బాగా రుబ్బి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ పేస్ట్ రాసుకోవడం వల్ల కూడా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
తెల్లజిల్లేడు చెట్టు ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి.ఏవైనా గాయాలు తగిలినప్పుడు వెంటనే ఈ జిల్లేడు ఆకుల పొడిని గాయం మీద రాయటం వల్ల వెంటనే రక్తస్రావం ఆగిపోయి గాయం తొందరగా మారిపోయేలా చేస్తుంది. మన పూర్వీకులు పాము కాటుకు చికిత్స చేయటానికి కూడా ఈ జిల్లేడు ఆకుల పొడిని ఉపయోగించేవారు. పాముకాటుకు గురైన వ్యక్తికి జిల్లేడు ఆకుల పొడి వేసి కట్టు కట్టడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది.