Brahmanandam: టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మానందం గురించి తెలియని వారు ఉండరు. ఆయన చేసే కామెడీ వల్ల చిన్న పిల్లలు కూడా ఆయనను బాగా గుర్తు పడతారు. తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ అంటే మొట్టమొదటగా గుర్తొచ్చే పేరు బ్రహ్మానందం. ఆయన లేకుండా దాదాపు ఏ సినిమా కూడా ఉండదు. సినీ ఇండస్ట్రీలో ఆయన చేసే కామెడీ వల్ల గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. 30 సంవత్సరాల తన సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలలో తన కామెడీతో మన అందరిని నవ్విస్తూనే ఉన్నాడు. అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలలో నటించిన వ్యక్తి గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాడు.
బ్రహ్మానందం ఒక గొప్ప నటుడిగా అందరికీ సుపరిచితమే. కానీ ఆయన ఒక గొప్ప చిత్రకారుడు అన్న సంగతి చాలా మందికి తెలియని విషయం. కరోనా విజృంభించిన సమయంలో లాక్ డౌన్ వల్ల ఆయనలోని చిత్రకారుడు బయట పడ్డాడు. ఆయన గీసిన ఎన్నో కళా ఖండాలు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు బహూకరించాడు. బ్రహ్మానందం దాదాపు 1250 సినిమాలలో నటించాడు. ఆయన మన తన ఆత్మకథను రాసుకుంటూ ఇండస్ట్రీలో తనకు ఎదురైన మంచి ,చెడు సంఘటనల గురించి ఆ పుస్తకంలో రాస్తున్నట్లుగా సమాచారం.
బ్రహ్మానందం ప్రస్తుతం అనారోగ్య కారణాల దృష్ట్యా సినిమాలు చేయడం తగ్గించారు.ఇండస్ట్రీలో హీరోలకు ఏమాత్రం తీసిపోని సంపాదనతో బ్రహ్మానందం ఆస్తులు బాగా కూడబెట్టారని సమాచారం. బ్రహ్మానందం తన రెమ్యూనరేషన్ లో సగం డబ్బును ఎక్కువగా భూములు కొనటానికి కేటాయించే వారు. ఇప్పుడు ఆ భూముల ధరలు బాగా పెరిగి ఆయన ఆస్తి విలువ పెరిగిపోయింది. బ్రహ్మానందం గారికి మొత్తం 500 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్టు సమాచారం. బ్రహ్మానందం గారికి ఎటువంటి దురలవాట్లు లేకపోవడం వల్లే అంత ఆస్తి కూడబెట్టారని సినీ వర్గాలలో వినికిడి.