Mustard Seeds Benifits: ఆవాలు పరిమాణంలో చిన్న.. ఆరోగ్య ప్రయోజనాలు మిన్న..!

Mustard Seeds Benifits:ప్రతి వంటింటి పోపుల పెట్టెలో కచ్చితంగా ఉండే దినుసులలో ఆవాలు ఒకటి. మన వంటిట్లో అనేక ఔషధ విలువలు కలిగిన పదార్థాలు ఉంటాయి. అనేక రోగాల నుండి ఉపశమనం కలిగించే ఔషధ గుణాలు కలిగిన పదార్థాలు అన్ని వంటింట్లో ఉంటాయి. పచ్చళ్ళు, ఊరగాయలు,అన్ని రకాల వంట పదార్థాలలో ఆవాలు లేనిదే రుచి ఉండదు. పూర్వం నుండి కొన్ని వేల సంవత్సరాలుగా ఆవాలను వంటలలో వినియోగిస్తున్నారు. చూడటానికి పరిమాణం లో చిన్నగా ఉన్నా కూడా వాటి రుచి ఎంతో అమోఘం. ఇవి ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. ఆవాలలో విటమిన్ ఎ, ఐరన్, ఫ్యాటీ యాసిడ్లు, జింక్, మెగ్నిషియం, మాంగనీస్, క్యాల్షియం ప్రొటీన్లు పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒకసారి చూద్దాం.

*100 గ్రాముల ఆవాల లో 9 నుండి 22 గ్రాములు విటమిన్ ఇ తో సమానమయ్యే టోకోఫెనాల్ అనే పదార్థం లభిస్తుంది. ఇది శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా నిరోధిస్తుంది. కొన్ని ఆవాలను వంటలలో ఉపయోగించమని డాక్టర్లు కూడా సలహా ఇస్తుంటారు.
*పంటి సమస్యలు ఉన్నవారు పంటి నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చటి నీటిలో కొన్ని ఆవాలు వేసి కొద్దిసేపటి తర్వాత ఆ నీటితో పుక్కిలిస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
*ఉబ్బసం, ఆస్తమా, ఆయాసం సమస్యలతో బాధపడేవారు పాలలో కొంచెం ఆవాలు పొడి కలుపుకుని తినడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఆస్తమా సమస్యతో బాధపడే వారు క్రమం తప్పకుండా ఆవాల తో కూడిన ఆహారం తినడం వల్ల ఆస్తమాను అదుపులో ఉండటంతోపాటు జలుబు, ఛాతీలో పట్టడం వంటి లక్షణాలు తగ్గుతాయి.
• ఆవాలు, ఆవ నూనె కాకుండా ఆవ పొడి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఆవాల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
• ఆవాలలో ఉండే మెగ్నీషియం కీళ్లనొప్పులు, ఆస్తమా, రక్త పోటు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆవాలలో ఉండే సెలీనియం అనే రసాయనం వల్ల మనకు యాంటీ ఇంప్లిమెంటరి ప్రయోజనాలు లభిస్తాయి.
• ఆవాలలోని కెరొటిన్స్, జియాగ్జాంథిన్స, ల్యూటిన్ వంటి పోషకాలు వయసు పెరగడం వల్ల శరీరంలో వచ్చే మార్పులను తగ్గించి యవ్వనంగా కనిపించడానికి తోడ్పడతాయి.
• ఆవాలలో ఉండే విటమిన్ ఏ, ఐరన్, ఫ్యాటీ యాసిడ్లు జుట్టు వత్తుగా పెరగడంలో సహాయపడతాయి.ఆవ పొడిని కానీ ఆవ నూనెను కానీ ఎక్కువగా జుట్టు కు పూయడం వలన పేళ్ళ సమస్యలు కూడా తాగ్గుతయి.