సాధారణంగా పళ్ళు కూరగాయలలో వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మనం ఎందుకు పనికిరాని పారబోసి వాటి వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సాధరణంగా గుమ్మడి కాయని చాలామంది కూరచేసుకొని తింటుంటారు. కానీ వాటిలో ఉండే విత్తనాలను మాత్రం పడేస్తారు. కానీ గుమ్మడి గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుమ్మడి గింజలు తినటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గుమ్మడి గింజలు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు కొన్ని గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
షుగర్ వ్యాధితో బాధపడే వారు గుమ్మడి గింజలు తినడం వల్ల అందులో ఉండే ఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు రక్తంలో షుగర్ లెవెల్స్ ని అదుపు చేయడంలో ఉపయోగపడతాయి. తద్వారా షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు కొన్ని గుమ్మడి గింజలు తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా గుమ్మడి గింజలు మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది హై బీపీ సమస్యని నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇక గుమ్మడి గింజలు మన రక్తంలో ఐరన్ శాతాన్ని పెంచుతాయి.
గుమ్మడి గింజల్లో జింక్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మెదడు పనితీరు కూడా మెరుగుపరుస్తుంది. గుమ్మడి గింజలు ఇలా శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడతాయి. అంతే కాకుండా గుమ్మడి గింజలు జుట్టు రాలే సమస్యని కూడా తగ్గిస్తుంది. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్స్ జుట్టు రాలే సమస్యని తగ్గించే జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ముఖ్యంగా పురుషులు గుమ్మడి గింజలు ప్రతిరోజు తినటం వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ పెరిగి సంతానలేమి సమస్యలు దూరమవుతాయి.