Health Benifits: పిల్లలతో వ్యాయామం చేయించడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Health Benifits: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మన శరీరం ఎంతో ఫిట్ గా ఉండాలన్న చాలామంది వ్యాయామం చేస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.అయితే వ్యాయామం కేవలం పెద్దవాళ్ళు మాత్రమే చేయాలని కొందరు అపోహ పడుతుంటారు. వ్యాయామం,శారీరక శ్రమ పెద్ద వాళ్లు మాత్రమే చేసేది కాదు చిన్న పిల్లలకు కూడా ఇది చాలా అవసరం. ఇది పిల్లల ఎదుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది. పిల్లలకు వ్యాయామం ఎంతో ముఖ్యమని, దీనివలన పెరిగే వయసులో ఎముకలు,కండరాలు బలపడటానికి చాలా ఉపయోగపడుతుంది అని నిపుణుల అభిప్రాయం.

పిల్లలకు స్మార్ట్ ఫోన్,లాప్ టాప్,ట్యాబ్ లాంటివి ఇవ్వడం తగ్గించి వారితో రోజు ఒక గంట సేపు ఉదయం లేవగానే వ్యాయామం అలవాటు చేయాలి. ఇలా చేయటం వలన వ్యాయామం అనేది పెద్దవారు అయిన తర్వాత కూడా వారి జీవనశైలిలో ఒక భాగం అవుతుంది. ఆరేళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న పిల్లలు రోజుకు కనీసం ఒక గంట సేపు వ్యాయామం,శారీరకశ్రమ చేయాలి. పిల్లలకు ఆటలు అంటే ఇష్టం కాబట్టి పిల్లల్ని అటువైపుగా ప్రోత్సహించాలి.ఈత,బాస్కెట్బాల్,ఫుట్ బాల్,పరుగు,డాన్స్ లాంటివి ప్రోత్సహించడం వలన రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది.

3-5 సంవత్సరాల పిల్లలు అయితే రోజంతా చురుకుగా ఉండేలా చూసుకోవాలి. ఈ వయసు పిల్లలు ఒకే దగ్గర కూర్చోనీ ఆడుకోవడం అంత మంచిది కాదు.ఇలా పిల్లల్లో వ్యాయామం వలన చాలా లాభాలు ఉన్నాయి. వారిలో ఏకాగ్రత,నైపుణ్యం పెరుగుతాయి. పెద్దయ్యాక వచ్చే మధుమేహం తగ్గుతుంది. రక్తపోటు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతాయి. అధికంగా బరువు పెరిగే ముప్పు తగ్గుతుంది. ఎముకలు,కండరాలు బలోపేతం అవుతాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.