Omicron: వాక్సిన్ తీసుకోని వారికి ఒమిక్రాన్ వల్ల ఎలాంటి ప్రమాదాలు కలుగుతాయో తెలుసా?

Omicron: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజువారి కేసులు భారీగా నమోదవుతున్నాయి. పోయిన సంవత్సరం మే నెలలో సెకండ్ వేవ్ చాలా ఎక్కువ ఉన్న సమయంలో ప్రాణాపాయం ఎక్కువ ఉంది . అయితే ఈ సంవత్సరం మొదలయినప్పటి నుండి కేసుల సంఖ్య పెరిగి, నెమ్మదిగా హాస్పిటల్స్ లో బెడ్స్ నిండిపోతు వస్తున్నాయి. ఇప్పుడు కరోనా కేసులే కాకుండా దాని వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి.

దేశంలో రోజువారి కేసుల సంఖ్య ఇప్పుడు దాదాపుగా 2.50 లక్షలు. చివరి ఎనిమిది నెలలో ఇవే అత్యధిక కేసులు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా దాదాపుగా 5500 గా నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల మీద కూడా ఇది పంజా విసురుతోంది. తెలంగాణలో 260 ఆంధ్రాలో 61 ఒమిక్రాన్ కేసులు ఒక్కరోజులో నమోదు అయ్యాయి అంటే ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో ఊహించుకోవచ్చు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 11 లక్షలకు చేరింది. గడచిన ఏడు నెలల్లో ఇదే అత్యధికం.

ఒమిక్రాన్ మన శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపలేదు.. అందుకు కారణం ఇది చాలా తేలికపాటి లక్షణాలు కలిగి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ మీరు కనుక వ్యాక్సినేషన్ తీసుకోకుంటే దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. నీతి ఆయోగ్ సభ్యుడు డా. వి. కె. పాల్ మాట్లాడుతూ ఒమిక్రాన్ చిన్న జలుబు వంటిది కాదని, దీనిని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. ఒమిక్రాన్ వల్ల అనేక దేశాలు అతలాకుతలం అయ్యాయని, వారి ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది అని ఆయన గుర్తు చేశారు. ఒమిక్రాన్ ను ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్, మాస్క్, భౌతిక దూరం ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇది ఒక సామాజిక బాధ్యత అని నేను నిన్ను అందరూ పాటించాలని ఆయన చెప్పారు.

బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కమిషనర్ ఇక్బాల్ చాహల్ మాట్లాడుతూ ముంబై ఆస్పత్రులలో అడ్మిట్ అయిన 1900 మంది బాధితులలో 96 శాతం మంది వ్యాక్సిన్ ఒక్క డోసు కూడా వేసుకొని వారే అని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకుని వారి మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళు ఉంటే దయచేసి వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు.