Pregnency: గర్భవతిగా ఉన్న మహిళల్లో అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయి. గర్భం దాల్చింది మొదలు ప్రసవం అయ్యే వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా గర్భవతి లో కనిపించే ఆరోగ్య సమస్యలలో కాళ్ళు వాపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య గురించి ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్యను అరికట్టవచ్చు. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
గర్భధారణ సమయంలో మహిళల్లో హార్మోన్ మార్పిడి వల్ల శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో కడుపులో శిశువు ఎదుగుదల కోసం శరీరం చాలా కృషి చేస్తుంది. గర్భవతిగా ఉన్న సమయంలో శరీరంలో నీటి శాతం పెరిగి కాళ్లు, చేతులు మొహం ఉబ్బినట్టు గా ఉంటాయి. ఈ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు సూచిస్తున్నారు.
కొన్ని సందర్భాలలో మనం తీసుకునే ఆహారం వల్ల కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు, కెఫిన్ ఎక్కువగా ఉండటం, శరీరానికి అవసరమైన నీరు తాగకపోవడం వల్ల ఎటువంటి సమస్య మొదలవుతుంది. మన శరీరానికి అవసరమైన పొటాషియం అందకపోవడం వల్ల కూడా కాళ్ళ వాపులు వస్తాయి. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల కాళ్ళ వాపు సమస్య దూరమవుతుంది.
గర్భవతిగా ఉన్న మహిళలు ఎప్పుడు ఒకే దగ్గర నిల్చోవడం , కూర్చోవటం చేయకూడదు. శరీరం ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండేలా తరచూ నీరు తాగుతూ ఉండాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేయడం, వాకింగ్ చేయడం వల్ల ప్రెగ్నెంట్ మహిళల్లో ఇటువంటి సమస్య దూరమవుతుంది.