Sonia Akula: తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సోనియా ఆకుల… ప్రాజెక్టు సక్సెస్ అంటూ రివీల్!

Sonia Akula: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సోనియా ఆకుల ఒకరు. బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సోనియా కొద్ది వారాలకి హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయ్యేలోపు ఈమె తన ప్రేమించిన వ్యక్తి యశ్ తో కలిసి ఏడడుగులు నడిచారు. ఇలా తన వైవాహిక జీవితంలో సోనియా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇక పెళ్లి జరిగిన వెంటనే ఈమె ఇస్మార్ట్ జోడి కార్యక్రమంలో తన భర్తతో కలిసి సందడి చేసిన విషయం తెలిసిందే. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సోనియా తాజాగా అభిమానులకు సోషల్ మీడియా వేదికగా శుభవార్తను తెలియజేశారు. త్వరలోనే ఈమె తల్లి కాబోతున్నారని,ఈ శుభవార్తను అందరితో పంచుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో భాగంగా తన భర్త ఆఫీస్ లో ఉండగా ఈమె ఆఫీస్ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ఫైల్ చేత పట్టుకొని తన భర్త ముందు ఉంచారు. అయితే అందులో ఈమె తల్లి కాబోతున్న విషయాన్ని తెలియచేయడంతో యష్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తనని హగ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్న ఈ జంట చాలా తక్కువ సమయంలోనే అందరికీ శుభవార్త చెప్పడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.