Onion: షుగర్ పేషెంట్లకు ఉల్లి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Onion: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు వాతావరణ కాలుష్యం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అటువంటి సమస్యలలో బీపీ,షుగర్ సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయి. నూటికి 80 శాతం మంది ప్రస్తుతం డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్ తో బాధపడే వారికి ఈ చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రతిరోజు మనం ఇంట్లో వంటలలో ఉపయోగించే ఉల్లిపాయ వల్ల షుగర్ సమస్యని నియంత్రించవచ్చు.

ఉల్లిపాయలలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ప్రతిరోజు ఉల్లిపాయను మనం తినే ఆహారంలో గాని, డైరెక్టుగా తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు యాభై గ్రాముల చొప్పున పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల వారి సమస్య తగ్గుముఖం పడుతుంది.

అధిక బరువు సమస్యతో బాధపడేవారికి కూడా ఉల్లిపాయ చాలా మేలు చేస్తుంది. ఉల్లిపాయ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు దూరం చేస్తుంది. ఉల్లిపాయని మెత్తగా రుబ్బి మూడు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలిపి ప్రతిరోజు తీసుకుంటే సంబంధిత వ్యాధులు కూడా నయమవుతాయి.
పచ్చి ఉల్లిపాయను ప్రతిరోజు తినటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాయ ముక్కలను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. దగ్గు ,జలుబు, ఇన్ఫెక్షన్స్ వంటి ఎన్నో రకాల వ్యాధులను ఉల్లిపాయ నయం చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల ప్రతి రోజూ ఉల్లిపాయ తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు.