Health Tips: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. సరైన ఆహారం తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా ఉండవచ్చు. చలికాలంలో శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. చలికాలంలో సరైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆహారపు అలవాట్లు శరీర పటుత్వాన్ని పెంచగలవు. శీతాకాలంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం.
*ఆపిల్, సీతాఫలం, జామ వంటి పళ్ళను ఎక్కువగా తినటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి , జీర్ణ వ్యవస్థ మెండుగా పనిచేస్తుంది.ఎముకల పటుత్వానికి కూడా పళ్ళు ఎంతో ఉపయోగపడతాయి.
*పల్లీలు (వేరు శనగకాయ) లలో విటమిన్ ఏ, డి, ఈ, పాలీఫినాల్స్ వంటి అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. అంతే కాకుండా శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
*నెయ్యి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో ఉండే మంచి కొలెస్ట్రాల్ శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
*కూరగాయలను తరచూ మనం వంటలలో ఉపయోగిస్తుంటాము. కూరగాయలలో విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. పచ్చిగా ఉండే కూరగాయలను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
*సజ్జల లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. సజ్జలతో లడ్డూలు కూడా తయారు చేసుకొని తింటారు. సజ్జాలతో తయారు చేసిన లడ్డూలు తినడం వలన ఎముకల పటుత్వం పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటారు.
*నువ్వులు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. నువ్వులతో లడ్డు లేదా చట్నీ చేసుకొని తినవచ్చు. ఈ ఆహార పదార్థాలను రోజు మీరు తినే ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.