Side Effects: అరటి పండ్లు ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. హాని కూడా కలిగిస్తాయని తెలుసా?

Side Effects : ఇప్పటివరకు అరటి పండ్ల వల్ల ప్రయోజనాలు గురించి విన్నాం కానీ వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే విషయం ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇది నిజం, అరటి పండ్లను కొన్ని సమయాల్లో తినకపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. సాధారణంగా అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే. భోజనం తర్వాత అరటి పండ్లను తినడం వలన అజీర్తి సమస్యలు తగ్గి, శరీర బరువును పెరగకుండా నియంత్రిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అరటి పండ్లు తినడం వల్ల, తిన్న ఆహారం బాగా జీర్ణమై కిడ్నీలో రాళ్లు పడకుండా నియంత్రిస్తుంది. అరటి పండ్లను సరైన సమయంలో తినాలి, అవేంటో చూద్దాం.

ఆహారం తినగానే అరటి పండ్లను తినడం మనలో చాలా మందికి అలవాటు. అయితే వీటిని రాత్రి భోజనం తర్వాత తినకూడదు. అరటి పండ్లలో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ B 6, విటమిన్ బి ఇంకా ట్రిప్టోఫిన్ ఉంటాయి. రాత్రి పూట శరీరానికి మరియు జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి చాలా అవసరం. కానీ రాత్రి పూట అరటి పండ్లను తినడం వలన వాటిలో ఉన్న పోషకాలు అరగటానికి చాలా సమయం పడుతుంది. అరటి పండ్లను తింటే శక్తి ఎక్కువగా ఉత్పన్నమయ్యి నిద్ర పట్టదు. పడుకునే ముందు అరటి పళ్ళను తినకపోవడం శ్రేయస్కరం.

ఖాళీ కడుపుతో అరటి పళ్ళను తినకూడదు. పరగడుపునే చాలామందికి అరటి పళ్లను తినడం అలవాటుగా ఉంటుంది. అరటి పండ్లలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది . మెగ్నీషియం రక్తంలోని క్యాల్షియం పరిమాణాన్ని దిగజారుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయాన్నే అరటిపండు తినకపోవడం మంచిది. పరగడపునే అరటి పండు ఒకటే కాకుండా వేరే పండ్లతో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

ఆయుర్వేదంలో వాత, కఫా, పిత్త అనే మూడు రకాలైన ప్రభావాలు ఉంటాయి. వీటిలో కఫా అనే ప్రభావం ఉన్న వ్యక్తులు అరటి పండ్లను తినకూడదు. ఆయుర్వేదం ప్రకారం కూడా అరటి పండ్లను సాయంత్రం వేళ తినకూడదు. జలుబు, దగ్గు, ఉబ్బసం లక్షణాలు ఉన్నవారు అరటి పండ్లను తినకూడదు. శ్వాసకోస సమస్యలు ఉన్నవారు అరటి పళ్ళను వీలైనంత తక్కువగా తినాలి.