Over Eating: అతిగా ఆహారం తీసుకుంటున్నారా… అది కూడా ఒక వ్యాధి అని తెలుసా?

Over Eating: ప్రస్తుత కాలంలో పనులమీద తొందర కారణంగా ఆహారాన్ని తింటున్నాము అంతేకాకుండా ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటున్నాము. అనే విషయాన్ని కూడా మరిచిపోతున్నాము. ఈ పనుల హడావిడి కారణంగా వేగంగా ఆహారాన్ని తీసుకుంటున్నాము. ఇలా చేయడం వల్ల తొందరగా ఆకలి వేస్తుంది. అలాగే ఎక్కువ సార్లు ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. ఇలా అతిగా తినటం కూడా ఒక వ్యాధి అని వైద్యులు తెలుపుతున్నారు.

ఇలా అతిగా తినటం వల్ల ఎక్కువగా ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం వల్ల అందరిలోనూ షేమ్ గా ఫీలవుతూ ఉంటారు. ఇలా తినటం కారణంగా తొందరగా బరువు పెరిగి అసహనానికి గురి చేసే అవకాశం కూడా ఉంటుంది. అతిగా తినడం అనే సమస్య కారణంగా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు మరీ ముఖ్యంగా మెదడు పనితీరు పై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ఇది ఊబకాయానికి, జీర్ణక్రియ సమస్యలకు కూడా దారితీస్తోంది.

అందుకని ఈ అతిగా తినటం అనే సమస్యకు దూరంగా ఉండటం మంచిది. దీనికోసం ఎక్కువ ఆహార పదార్థాలను ఒకేసారి కాకుండా తక్కువగా ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. అలాగే బాగా నమిలి తినడం కూడా మంచిది.ముఖ్యంగా పీచు పదార్థం కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మలబద్ధకం కూడా తగ్గుతుంది.నీటిని లేదా పెరుగు వంటివి తీసుకోవడం వల్ల ప్రేగులలో మంచి బ్యాక్టీరియా ని వృద్ధి చేసి ప్రేగులలో ఉండే వ్యర్థ పదార్థాలు తొలగించడంలో ఇవి సహాయం చేస్తాయి.

కాబట్టి జంక్ ఫుడ్ , నూనెకు సంబంధించిన పదార్థాల వంటి వాటికి దూరంగా ఉంటూ తేలికపాటి వ్యాయామాలు చేసుకుంటూ అతిగా తినటం అనే సమస్యకు దూరంగా ఉండండి.లేదంటే ఇలాంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.