మనం తినే ఆహారం, తాగే నీరు, పీల్చుకొనే గాలి మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ మూడింటిలో లో ఏ ఒక్కటి కలుషితమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రస్తుతం ఉరుకులు, పరుగుల జీవితంలో సమయానికి ఆహారం తీసుకోవటం కూడా కష్టతరంగా మారింది. మనం మంచి ఆహారం తీసుకోవటమే కాకుండా తగిన సమయానికి ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం. ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం , ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యమైనది. అయితే రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల మీ జీర్ణ శక్తిని , ఇమ్మునిటీని పెంచుకోవచ్చుఅవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలోకి ఒక టీ స్పూన్ తేనె ఇంకా కొంచెం నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా.. చర్మ సంరక్షణకు.. ఇమ్మునిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. బాడిలో ఫ్రీరాడికల్స్తో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ డ్రింక్ లోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
దాల్చిన చెక్కని ఉదయాన్నే మనం తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉదయాన్నే కాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి, కలిపి తాగటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారికి కూడా ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది.
ఉసిరికాయ లో విటమిన్ C అధికంగా ఉంటుంది, దీనిని రోజూ ఉదయాన్నే వేడి నీటిలో తురుముకొని తీసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ పవర్ పెంచి శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
ఉసిరికాయ జుట్టు సంరక్షణకు కూడా భాగా ఉపయోగపడుతుంది.
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. ఇంకా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటం తో పాటు అంటువ్యాదుల నుండి రక్షణ కల్పిస్తుంది. రోజూ ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో వెల్లులిని కలిపి తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.
బొప్పాయి తినడానికి రుచిగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. బొప్పాయిలో ఫైబర్, ఫోలెట్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని పడగడపునే తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎండుద్రాక్షను తినడం లేదా నానబెట్టుకొని ఆ నీటిని తాగడం వలన కూడా చాలా ఆరోగ్య ప్రయోజననాలు ఉంటాయి.