పచ్చి మిర్చిలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?

పచ్చిమిర్చి కారంగా ఉన్నా పచ్చి మిర్చి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజాలున్నాయి. వంటలలో ఒకటి రెండు పచ్చి మిర్చి ముక్కలు చేసి వేస్తుంటాము, దీని వల్ల వంటలు చాలా టేస్ట్ గా ఉంటాయి. అయితే తినేటపుడు మాత్రం మిర్చి ముక్కలను పక్కన పెట్టేసి తింటుంటారు. అలా చేస్తున్నారు అంటే మీరు మీ శరీరానికి అవసరమైన పోషకాలను కోల్పోతున్నట్టే.మరి పచ్చి మిర్చి తినడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

పచ్చి మిర్చి తింటే అల్సర్ వచ్చే ప్రమాదం ఉందని డయాబెటిక్ పేషంట్స్ కూడా పచ్చి మిర్చికి దూరం పెడుతుంటారు. ముఖ్యంగా చలికాలం లో పచ్చి మిర్చి బాగా తినాలి. దీని వలన దగ్గు, జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు దూరం చేయవచ్చు. పచ్చి మిర్చిలో విటమిన్ -సీ పుష్కలంగా లభిస్తుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.

పచ్చి మిర్చిలో విటమిన్ -సీ ఉండటం వలన చర్మం పై ముడతలు తగ్గించి మీ వయసును తగ్గిస్తుంది. పచ్చి మిర్చి తినేటపుడు మెదడులో ఎండార్ఫిన్ లు ఎక్కువగా విడుదలవుతాయి తద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెదడులో రక్తం గడ్డ కట్టకుండా ఇది కాపాడుతుంది. పచ్చి మిర్చి వలన మీ శరీర అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

పచ్చి మిర్చి లో విటమిన్- ఎ ఎక్కువగా ఉండటం వలన దంతాలు, ఎముకలు ఎక్కువ దృఢంగా తయారవుతాయి. పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్, నరాల బలహీనత, పక్షవాత సమస్యలు రాకుండా కాపాడుతుంది. పచ్చి మిర్చిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నందున క్యాన్సర్ కు వ్యతిరేకంగ పోరాడుతుంది. పచ్చిమిర్చి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అందుకే కూరల్లో వీలైనంతగా కారం పొడికి బదులుగా పచ్చి మార్చి వాడితే మంచిది.