Miss Universe Crown: గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినిపిస్తున్న పేర్లలో
హర్నాజ్ సందూ పేరు ఒకటి. ఈమె భారత దేశానికి చెందిన యువతి అయినప్పటికీ ఇజ్రాయిల్ లోని మిస్ యూనివర్స్ 2021 ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది.ఈ క్రమంలోనే ఈమె మిస్ యూనివర్స్ అవార్డు గెలుచుకోవడం భారత దేశానికి ఎంతో గర్వకారణంగా ఉన్నప్పటికీ ఈమెకు ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మిస్ యూనివర్స్ కిరీటం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి.
ఈ కిరీటంలో ఎన్ని వజ్రాలు పొదిగిన ఉన్నాయని ప్రతి ఒక్కరు కిరీటం గురించి చర్చలు జరుపుతున్నారు. ఎంతో అందమైన ఈ కిరీటంలో 1725 వైట్ డైమండ్స్ అలాగే 3 బంగారు రంగులో ఉన్నటువంటి పెద్ద వజ్రాలను అమర్చారు. మధ్య భాగంలో… ‘మాడిఫైడ్ మిక్స్డ్ కట్ గోల్డెన్ క్యానరీ డైమండ్’. దాని బరువు 62.83 క్యారెట్లు. మకుటం మధ్యలో వెలిగిపోయే ఆ వజ్రం ‘స్త్రీలోని ఆంతరంగిక శక్తి’కి నిదర్శనం అని మౌవాద్ వెల్లడించారు.
ఈ మిస్ యూనివర్స్ కిరీటాన్ని మౌవాద్ ఎంతో అందంగా రూపొందించారు. ఇక ఈ కిరీటం హర్నాజ్ సందూ తలపై సంవత్సరంపాటు మెరువనుందని ఈ సందర్భంగా మౌవాద్ తెలిపారు. గతంలో ఈ కిరీటాన్ని సుస్మితాసేన్ లారాదత్తా వంటివారు దక్కించుకోగా ప్రస్తుతం ఈ కిరీటాన్ని హర్నాజ్ సందూ కైవసం చేసుకుంది.17 వ యేటా మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఈమె పలు చిత్రాల్లో కూడా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
